Home

»

Latest News

Youth: యూత్ ఓటిటి డేట్ ఇదే.. ఆనందం మీ సొంతం 

Apr 11, 2026

 

 -గత నెల 27 న తెలుగులో రిలీజైన యూత్ 
-ఇప్పుడు నేరుగా మీ కోసం ఓటిటిలోకి 
-ఎక్కడ, ఎప్పుడు


అంచనాలు లేకుండా వచ్చి ఘన విజయాన్ని అందుకున్నచిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన చిత్రం యూత్(Youth). డబ్బులు పెట్టి ఎన్ని ప్రమోషన్స్ చేసుకున్నా టాక్ విషయంలో మౌత్ టాక్ ని మించిన మహర్దశ మరొకటి ఉండదని నిరూపించింది. చాలా మంది యూత్ ఎక్కడ ఆడుతుందో కనుక్కొని మరి థియేటర్స్ కి వెళ్లడమే అందుకు ఉదాహరణ. ఇప్పుడు ఈ మూవీ మీ ఇంటికే వస్తుంది. బహుశా ఎండల్లో తన కోసం వెతికే పని లేకనేమో. మరి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పి ఎంజాయ్ చేయండి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.


 యూత్ ఓటిటి హక్కులని నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ఈ మేరకు ఈ నెల 16 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టుగా నెట్‌ఫ్లిక్స్‌ అధికారకంగా  ప్రకటించింది. కెన్ కరుణాస్(Ken Karunas)హీరోగా చేస్తు  దర్శకత్వం వహించగా  కథ, కథనం ఏజ్ తో పని లేకుండా ప్రతి ఒక్కరి హృదయాలని టచ్ చేస్తుంది. హీరోయిన్స్ దగ్గరనుంచి ప్రతి ఒక్కరు అత్యద్భుతంగా చేసారు. స్కూల్ లైఫ్, టీనేజ్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నిటిని దాచుకోవడం యూత్ స్పెషాలిటీ. మరి థియేటర్లలో  మిస్ అయిన వారు, ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూసి సినీ ఎంజాయ్ ని మీ సొంతం చేసుకోండి.


Also read: Dacoit: డెకాయిట్  ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. మరి హిట్టా ప్లాపా!


 జి.వి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం మేజర్ అసెట్‌. గత నెల మార్చి 19 న తమిళ్,  27 న తెలుగులో రిలీజయ్యింది. అనీష్మా,  ప్రియాన్షి, మీనాక్షి, దేవదర్శిని కీలక రోల్స్ లో కనిపించారు  

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com