Home

»

Latest News

Pawan Kalyan: ఇంకో వికెట్ జైలు గూటికి.. హద్దు మీరితే ఇంతే 

Apr 17, 2026


-స్టాండప్ కామెడీ పేరుతో ఓవర్ యాక్షన్ 
-ముందు ముందు మరింత లిస్ట్ బయటపడుతుందా
-ట్రాఫిక్ మహమ్మద్ ఎవరు


స్టాండప్ కామెడీ పేరుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వ్యక్తిగత జీవితాన్ని అవహేళన చేయడంతో ఫాన్స్, జనసేన కార్యకర్తలు కేసు నమోదు చేయడంతో అనుదీప్ కటికాల కటకటాలపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో స్టాండప్ కమెడియన్ పవన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. ఆ డీటెయిల్స్ చూద్దాం.

రఫిక్ మొహమ్మద్.. వైజాగ్ కి చెందిన స్టాండప్ కమెడియన్. ప్రదర్శనలో భాగంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా ఆయన వివాహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ షో చేసాడు. అయితే అవి గతంలో చేసిన వీడియోలు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో జనసేన నాయకులు మచిలీపట్నం పోలీసులకి  ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి, రఫిక్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని భావించి నిన్న రాత్రి విశాఖపట్నంలో రఫీక్ ని అదుపులోకి తీసుకున్నారు.

also read: Sriramudu: రాముడిపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు 

ఈ వరుస అరెస్ట్ పై పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు  స్టాండప్ కామెడీ అనేది కూడా ఒక కళ. కానీ ఒకరి వ్యక్తిగత జీవితంలో ఉన్న లోటుపాట్లపై కామెంట్స్ చేసి నవ్వు తెప్పించడం ఏంటి! ఇక నుంచైనా స్టాండప్ కామెడీ చేయాలనీ అనుకున్న వారు నిజమైన హాస్యానికి అర్ధం తెలుసుకొని ప్రదర్శన ఇవ్వాలి. అలా కాకుండా వ్యక్తిగత దూషణలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే  కామెంట్స్  చేస్తున్నారు.  అనుదీప్ కటికాలకి అయితే బెయిల్ వచ్చింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com