![]() |
![]() |

ప్రపంచంలోని ప్రతీ మనిషి కథ భిన్నంగా ఉంటుంది. ఒకరు కోట్ల మందిలో కామన్ మ్యాన్ గా బ్రతకాలనుకుంటారు. మరొకొంతమంది కోట్లమందితో కామన్ మ్యాన్ అనిపించుకుంటారు. తాజాగా కామన్ మ్యాన్ గా రైతుబిడ్డగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి విమర్శకుల ప్రశంసలు పొందాడు.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పల్టా థీమ్ తో ప్రేక్షకులని ఎంతగా మెప్పించిందో అందరికి తెలిసిందే. అందులో రైతుబిడ్డగా మల్లొచ్చిన అంటే తగ్గేదేలా అంటు ఎంట్రీ ఇచ్చి తనని విమర్శించిన వారిచేత రివ్యూలు చెప్పించుకొని ప్రశంసలు పొందిన తొలి కంటెస్టెంట్. ఎవరి అంచనాలకి అందకుండా ప్రతీవారం భారీ నామినేషన్ లో ఉన్నా.. ప్రతీవారం భారీ ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉండేవాడు. దాంతో ఫైనల్ లో అమర్ దీప్ రన్నరప్ గా పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. హౌస్ లో ఉన్నన్నిరోజులు శివాజీ గురువుగా ప్రశాంత్ శిష్యుడుగా.. ఇది కదా గురుశిష్యుల బంధమనిపించేలా కలిసి ఉన్నారు. అయితే మధ్యలో రతికరోజ్ లవ్ ట్రాక్ వల్ల ఎక్కడ తన గాడి తప్పుతాడోనని అనుకున్నారంతా కానీ ప్రతీ ఆటలో తన వంద శాతం చాలాసార్లు గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత విజేతగా నిలిచి బయటకొచ్చాడు.
బిగ్ బాస్ విజేతగా నిలిచిన సంతోషాన్ని తన అభిమానులు ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు. పబ్లిక్ వాయిలెన్స్ చేసి అతడిని జైలు పాలుచేశారు. అయినసరే ఎదురునిలబడి ధర్మంగా శిక్ష అనుభవించి.. తనని తీసుకెళ్ళిన పోలీసుల చేతనే సభాష్ అనిపించుకున్నాడు. ఇక బయటకొచ్చాక తనకు ఫ్యాన్స్ మరింతగా పెరిగారు. ఇక తను ఎక్కడికెళ్ళిన ఒకటే క్రేజ్. తాజాగా పల్లవి ప్రశాంత్ ఓ పోస్ట్ చేశాడు. " నా ప్రాణం ప్రజల కోసం.. నా ఈ దేహం దేశం కోసం.. మళ్ళీ నా కొత్త పోరాటం మొదలైంది. జై జవాన్ జై కిసాన్ " అంటూ ఓ పోస్ట్ చేశాడు. అసలు ప్రశాంత్ చేయబోతున్న కొత్త పోరాటం ఏంటి అనేది ఇప్పుడు అందరిలోను ఆసక్తి మొదలైంది. మరి మీలో ఎంతమంది అతనికి అభిమానులుగా ఉన్నారు. కామెంట్ చేయండి.
![]() |
![]() |