![]() |
![]() |

ఎట్టకేలకు చరణ్ తన గేమ్ చేంజర్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు.మరి కొద్దీ రోజుల్లో ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఆ తర్వాత వెంటనే బుచ్చిబాబు సినిమాలో జాయిన్ అవుతాడు. ఆల్రెడీ ఒక పక్కన ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. తాజాగా ఆ మూవీ హీరోయిన్ విషయంలో ఒక నయా రూమర్ చక్కెర్లు కొడుతుంది.
చరణ్ బుచ్చి బాబుల మూవీ RC 16 వర్కింగ్ టైటిల్ తో షూట్ కి వెళ్ళడానికి రెడీ అవ్వబోతుంది. అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ చరణ్ తో ఓ జోడి కడుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఆల్రెడీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు కూడా. ఇప్పుడు ఈ మూవీలో మరో హీరోయిన్ కి చోటు ఉందనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్
ముద్దుగుమ్మ కృతి సనన్ ఆ ప్లేస్ లో నటించబోతుందని అంటున్నారు.ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండబోతుందని అందులో వచ్చే చరణ్ క్యారక్టర్ కే కృతి ని తీసుకుంటున్నారని సమాచారం.

2014 లో మహేష్ బాబు హీరోగా వచ్చిన 1 నేనొక్కడినే ద్వారా కృతి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇటీవలే ప్రభాస్ ఆదిపురుష్ లో సీతగా నటించి అందర్నీ మెప్పించింది. ఆమె చరణ్ సినిమాలో చేసే వార్త నిజమయితే కనుక ఆమె కెరీర్ కి మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇక చరణ్ బుచ్చి బాబు మూవీ ఒక గ్రామీణ క్రీడ కి సంబంధించిన కధాంశంతో తెరక్కబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించబోతోంది.
![]() |
![]() |