![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -408 లో.. మురారిని ముకుంద గార్డెన్ ఏరియాలోకి రమ్మని మెసేజ్ చేస్తుంది. అది కృష్ణ చూసి.. మురారికి చెప్తుంది. వెళ్ళండి పిలుస్తుంది కదా అని కృష్ణ అనగానే.. నేను వెళ్ళను ఆ సోది వినే ఇంట్రస్ట్ లేదు గానీ, వాటికి సమాధానం చెప్పే ఓపిక గానీ నాకు లేదని మురారి అంటాడు. వెళ్ళండి వెళ్తేనే కదా తనేం మాట్లాడుతుందో.. ఏం చెయ్యాలని అనుకుంటుందో తెలుస్తుందని కృష్ణ అంటుంది. నేను వెళ్ళనని మురారి అనగానే.. అక్కడ మీరు ఏం మాట్లాడతారోనని నేనేం అనుకుంటానోనని ఆలోచిస్తున్నారా.. అలా ఏం లేదు మీరు ఎప్పటికి నా ఏసీపీ సర్.. మిమ్మల్ని నానుండి ఎవరు వేరు చెయ్యరని కృష్ణ అనగానే.. మురారి వచ్చి కృష్ణని హగ్ చేసుకుంటాడు.
ఆ తర్వాత ఏంటి ఆదర్శ్ ని పంపించేయని చెప్తే.. నీ శోభనానికి ముహూర్తం పెట్టుకుని వచ్చావ్? ఏంటని మురారిని ముకుంద అడుగుతుంది. అవును నేనే పెట్టుకొని వచ్చానని మురారి అంటాడు. ఆదర్శ్ ని పంపించేయ్ అంటున్నావ్? ఎక్కడికి పంపాలి.. వాడి ఇల్లు ఇది.. వాడి ఇంట్లో నుండి వాన్ని ఏం తప్పు చేసాడని పంపించాలి. నిన్ను ప్రేమించినందుకా అని మురారి అంటాడు. నిన్ను ప్రేమించినందుకు నా గురించి ఆలోచించడం లేదని ముకుంద అంటుంది. నేనేం చెయ్యాలో నాకు తెలుసని ముకుంద అంటుంది. నేనేం చెయ్యాలో కూడా నాకు తెలుసని మురారి అంటాడు. ఇద్దరు కాసేపు వాదించుకుంటారు.
ఆ తర్వాత అందరు గుడికి వస్తారు. కృష్ణ, మురారి వేరే కారులో వస్తే త్వరలోనే నాతో సపరేట్ గా వచ్చే రోజు వస్తుందని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత శోభనం జరిగే రోజు ప్రత్యేక పూజలు చేయించాలని రేవతి అంటుంది. అంటే ఏంటని మధు అడుగుతాడు.. భార్యాభర్తలతో అడుగులు వేయించాలని రేవతి చెప్తుంది. ఆ తర్వాత అందరు లోపలికి వెళ్తుంటే ముకుంద మాత్రం నేను సరిగ్గా కాళ్ళు కడుక్కోలేదని ఆగుతుంది. ఆ తర్వాత మురారి నడిచిన అడుగులపై ముకుంద అడుగులు వేస్తు వెళ్ళిపోతుంది. అది చూసిన మధు.. కృష్ణని పిలుస్తాడు. కానీ అప్పటికే ముకుంద వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భర్త పాదాలపై భార్య కాళ్ళు పెట్టి ప్రదక్షినలు చేయాలని పంతులు గారు చెప్పగానే.. ముకుంద షాక్ అవుతుంది. తరువాయి భాగంలో కృష్ణ, మురారి ఇద్దరు రెస్టారెంట్ లో ముకుంద, ఆదర్శ్ ల గురించి మాట్లాడుకుంటారు. నువ్వు అంటే ఇష్టం లేదని డైరెక్ట్ గా ఆదర్శ్ తో ముకుంద చెప్తే పరిస్థితి ఏంటని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |