![]() |
![]() |

సినిమా హీరోయిన్ లకి ధీటుగా జ్యోతిరాయ్ అందాల విందు ఇస్తోంది. నెటిజన్లకి ఎవరీ భామ అని చూసేంతలా రెచ్చిపోతుంది జ్యోతి రాయ్. అందరికి ఈమె ఎవరో తెలిసి ఉండకపోవచ్చు గానీ బుల్లితెర ప్రేక్షకులకు జగతి మేడమ్ అంటే తెలియని వారు ఉండరు. స్టార్ మాటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే "గుప్పెడంత మనసు" ప్రేక్షకులకు జగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో అందరిని మెప్పిస్తూ, ఒక తల్లిగా కొడుకుపై చూపించే ప్రేమని వ్యక్తపరచడంలో జగతి పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది.
తక్కువ సమయంలోనే బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ నటుల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. రిషీ తల్లిగా నటిస్తున్న జగతి(జ్యోతి రాయ్) వయసు ముప్పై ఎనిమిదేళ్లేనని తెలిసిందే. గుప్పెడంత మనసుతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేశారు. జ్యోతి రాయ్ కన్నడ నటి.. కన్నడలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ప్రసారమైన 'కన్యాదానం' సీరియల్ లో నిరుపమ్ పరిటాలతో కలిసి మొదటిసారి జ్యోతిరాయ్ నటించింది. ఆ తర్వాత 'గుప్పెడంత మనసు' సీరియల్ లో ప్రస్తుతం నటిస్తుంది. గత కొంతకాలం నుండి గుప్పెడంత మనసు సీరియల్ టాప్ రేటింగ్ లో ఉంటు వస్తుంది. జ్యోతిరాయ్ అలియాస్ జగతి.. అలనాటి నటుడు సాయి కిరణ్ కి భార్యగా గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తన అందంతో పాటు హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జగతి. జ్యోతి రాయ్ ఒకవైపు ఈ సీరియల్ మరొక పక్క ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటుంది.
![]() |
![]() |