![]() |
![]() |
.webp)
ఒక దర్శకుడు తనంతట తానుగా పిలిచి తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తాను అంటే కొత్త పాతా అని తేడా లేకుండా అందరు హీరోయిన్ లు ఎంతగానో ఆనందపడతారు. పైగా అది కూడా ప్రెజంట్ హిట్టు ప్లస్ క్రేజ్ ఉన్న దర్శకుడి మూవీలో అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు.ఎందుకంటే ఆ దర్శకుడి సినిమాలో నటించడం ద్వారా ఆ హీరోయిన్ సినిమా జర్నీ మరిన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తుంది. కానీ ఇందుకు బిన్నంగా ఒక పెద్ద హీరోయిన్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది.
యానిమల్ మూవీతో ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో కంగనా రనౌత్ తో కలిసి పని చెయ్యాలని ఉందన్నాడు.సందీప్ చెప్పిన సదరు తాలూకు వీడియోని కంగనా కి ఒక వ్యక్తి ట్వీట్ చేసాడు .దీంతో కంగనా రంగంలోకి దిగి తన ట్విట్టర్ వేదికగా సందీప్ రెడ్డి నువ్వు నాకు నీ సినిమాలో ఎలాంటి అవకాశం ఇవ్వొద్దు. ఎందుకంటే నాకు నీ సినిమాలో అవకాశం ఇస్తే కనుక మూవీలోని ఆల్ఫా మేల్ హీరోలంతా ఫెమిస్టులు అయిపోతారు అప్పుడు నీ సినిమా ప్లాప్ అవుతుంది. కానీ నాకు అలా జరగడం ఇష్టం లేదు. మీరు ఇండస్ట్రీ కి కావాలి బ్లాక్ బస్టర్లని అందించాలని చెప్పింది. ఇప్పుడు ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి తెలియని వారు లేరు. సినిమాల ద్వారా ఎంత పేరు సంపాదించిందో ఎలాంటి సమస్య పైన అయినా ముక్కుసూటి తనంగా మాట్లాడటం ద్వారా కూడా కంగనా అంత కంటే ఎక్కువ పేరే సంపాదించింది.కంగనా ప్రస్తుతం ఇందిరాగాంధీ క్యారక్టర్ ని పోషిస్తు ఎమర్జెన్సీ అనే సినిమాలో నటిస్తుంది.
![]() |
![]() |