![]() |
![]() |
.webp)
బాలాదిత్య దూరదర్శన్ కాలం నుంచి తెలిసిన నటుడు. ఎన్నో మూవీస్ లో నటించాడు. ముఖ్యంగా "ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం" మూవీలో స్టాంప్ రోల్ లో అందరికీ గుర్తుండిపోయాడు. అలాంటి బాలాదిత్య ఇప్పుడు "శ్రీహరి కళ్యాణం" అనే సీరియల్ లో నటిస్తున్నాడు. ఇక సుమ తన చాట్ షోలో ఈ సీరియల్స్ యాక్టర్స్ ఐన బాలాదిత్య, షెరీన్ తో కలిసి చిట్ చాట్ చేసింది. అందులో బాలాదిత్య తనకు జరిగిన ఒక పెళ్లిచూపులు విషయాన్నీ షేర్ చేసుకున్నాడు. "ఆ ఆరో, ఏడో పెళ్లి చూపులు..ఆ టైములో నేను ఛాంపియన్ షో చేస్తున్న ఈటీవీలో..ఆ అమ్మాయి ప్రొఫైల్ ని వాళ్ళ అమ్మగారు హ్యాండిల్ చేస్తుంటారు. పెళ్లిచూపులు ఈవెనింగ్ 6 కి అని మెసేజ్ పెట్టారు. సరిగ్గా ఆ టైంకి నా షో వస్తుంది. నేను ఒక కాఫీ షాప్ లో కూర్చున్న. అక్కడ టీవీ ఉంది. అక్కడి వాళ్ళు నన్ను చూసి ఆ షోకె పెట్టారు. కాసేపటికి ఆ అమ్మాయి వచ్చింది. నేను చాల జోవియల్ గా ఉంటుంది అనుకున్నా.
కానీ రావడమే మూడీగా వచ్చింది. రాగానే లాప్ టాప్ ఆన్ చేసుకుని హాయ్ నేను పని మధ్యలో రావాల్సి వచ్చింది..అని చెప్పింది. ఒక కాల్ అటెండ్ చేసింది. నేను ఓకే అన్నాను. అప్పుడు నేను మూవీస్ గురించి మీ ఒపీనియన్ ఏమిటి అని అడిగాను. ఐ హేట్ మూవీస్ అంది. మీరు నా ప్రొఫైల్ చూడలేదా అని అడిగాను. అదంతా మా అమ్మ చూసుకుంటుంది అని చెప్పింది. ఆ అమ్మాయి యూఎస్ లో పుట్టి చదుకుని ఇక్కడికి వచ్చింది. జనాలు ఎందుకు మూవీస్ మీద అంత డబ్బును వేస్ట్ చేస్తారో అర్ధం కాదు అంది. ఆ మాటలకు అర్జెంటుగా ఆ షాప్ అతనికి చెప్పి ఆ టీవీ ఆపించాను. అంటే నేను ఫస్ట్ టైం ఒక మనిషితో ఐదు నిముషాలు మాట్లాడాక అర్థమైపోయింది. అవతలి వాళ్ళ గురించి ఏమీ తెలుసుకోకుండా...ప్రొఫెషన్ గురించి తెలుసుకోకుండా మాట్లాడకూడదు అనుకున్న. ఇక ఆ టైములో బాహుబలి మూవీ వస్తోంది. బాహుబలి అనే మూవీ 100 క్రోర్స్ ఎందుకు ఖర్చుబెడుతున్నారండి...అదే టెక్నాలజీ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయరు. టెక్నాలజీ డెవలప్ అవుతోంది కదా అని అంది. ఓ అని నైస్ మీటింగ్ యు అని చెప్పి బయటకు వచ్చేసాను" అని చెప్పాడు బాలాదిత్య.
![]() |
![]() |