![]() |
![]() |

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఆగష్టు 29 న లాంచ్ కాబోతోంది. ఇక ఈ షోకి జడ్జెస్ గా ఎప్పటిలాగే థమన్, కార్తీక్, గీతా మాధురి వచ్చారు. ఇక హోస్ట్ గా శ్రీరామచంద్ర వచ్చేసాడు. ఇక సమీరా భరద్వాజ్ ఐతే ముసుగు కప్పుకుని శ్రీరామచంద్ర చుట్టూ తిరుగుతూ "కైసే హో జీ" అంటూ హిందీలో అడిగింది. "మై టీక్ హూ జి" అని చెప్పాడు శ్రీరామచంద్ర. తర్వాత ముసుగు తీసి లకలకలకలక అంటూ భయపెట్టేసింది. "ఏంటి సమీరా నువ్వేమిటి ఇక్కడ" అన్నాడు. "మూడు సీజన్లుగా నువ్వొక్కడివే అల్లాడిపోతున్నావ్ గ ఇక్కడ ఈ సీజన్ లో ఇద్దరం కలిసి అల్లాడిద్దాం" అని చెప్పింది.
ఇక అద్భుతమైన కంటెస్టెంట్స్ వచ్చారు. ఇక థమన్, కార్తీక్ కలిసి చాలా ప్రామిస్ లు చేశారు కంటెస్టెంట్స్ కి. పవన్ కళ్యాణ్ సాంగ్ పాడిన ఒక కంటెస్టెంట్ కి థమన్ మాటిచ్చాడు. త్వరలో కలిసి మనం పని చేద్దాం అన్నాడు. ఇక ఒక కంటెస్టెంట్ ఐతే ఫ్లూట్ పట్టుకుని వచ్చి పాడిన సాంగ్ కి మంచి మ్యాటర్ ఉంది అంటూ గీత మాధురి కాంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇక కార్తీక్ సాంగ్ పాడుతుంటే ఆ కంటెస్టెంట్ దానికి ఫ్లూట్ తో మ్యూజిక్ ని అందించాడు. తర్వాత ఒక దివ్యాంగుడు వచ్చారు. ఆయనకు కళ్ళు కనిపించవు. ఇక అతను పాడిన పాటకు జడ్జెస్ ముగ్గురు ఫుల్ ఫిదా ఇపోయారు. థమన్ ఐతే "ఎలా మీకు కంటి చూపు లేదు అనేసరికి చిన్నప్పటి నుంచి లేదు సర్ చూపు" అన్నాడు. "నేను కార్తీక్ కలిసి నీకు కంటి చూపు వచ్చేలా చేస్తాం" అని ప్రామిస్ చేసాడు.
![]() |
![]() |