![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 రోజు రోజుకి ఆసక్తిని పెంచేస్తుంది. ఎవడిలో ఎంతుందో.. టైమ్ వచ్చినప్పుడు తెలుస్తుందంటారు కదా.. అదే జరుగుతుంది హౌస్ లో. సైలైంట్ గా ఉంటాడనుకున్న మర్యాద మనీష్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిబ్బా చేష్టలతో విసుగుతెప్పించే రీతూ చౌదరి నామినేషన్ పాయింట్లు మాట్లాడటం చూసి.. ఈమెలో ఇంతుందా అని జనాలు అనుకుంటున్నారు.
అయితే ఈ రోజు రిలీజ్ చేసిన ప్రోమోలో ఇమ్మాన్యుయల్ పై మాస్క్ మ్యాన్ హరీష్ విషం చిమ్మాడు. తనలోని సైకో బయటకొచ్చినట్టుగా ఉంది. నామినేషన్ పాయింట్ ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో పూర్తిగా కంట్రోల్ తప్పాడు మాస్క్ మ్యాన్. అతని బిహేవియర్ చూసి హౌస్ లోని కంటెస్టెంట్సే కాదు చూసిన ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. బిగ్ బాస్ ద్వారా బాగుపడేవారికంటే వారి క్యారెక్టర్ బ్యాడ్ చేసుకునే వారే ఎక్కువ. అలాగే ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ తన క్యారెక్టర్ ని కోల్పోతున్నాడు. శ్రీజ, ప్రియ, మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్ వీళ్ళు హౌస్ లోకి రాకముందు సామాన్యులకి సపోర్ట్ చేయాలనిపించేది జనాలకి. ఇప్పుడేమో మనం అగ్నిపరీక్షలో చూసిన ఆ సామాన్యులేనా వీళ్లూ అనేంతగా దిగజారిపోయి, బిగ్ బాస్ షో చూసే వాళ్లు ఏడ దొరికిన సంతరా ఇదీ అని తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముందు వీళ్లని మెడపట్టి బయటకు గెంటేయండి బిగ్ బాస్ అని టీవీలు కట్టేసే పరిస్థితి తీసుకొచ్చారు.
బిగ్ బాస్ సీజన్-9 తెలుగు(Bigg Boss season 9 Telugu) తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రీతూ చౌదరి ఏడ్చేసింది. మాస్క్ మ్యాన్ నేను వెళ్లిపోతానని అనడంతో.. గివ్ అప్ ఇచ్చే పర్సనాలిటీ అని అర్థం అయిపోతుందంటూ రీతూ చౌదరి నామినేషన్ పాయింట్ చెప్పింది. అది గివ్ అప్ కాదు.. బయట నేను కొంతమందిని కాపాడుకోవాలి.. చరిత్ర హీనుడని చెప్పి నాపై ముద్ర వేశారు కదా అంటూ మాస్క్ మ్యాన్ హరీష్ ఎదురుతిరిగాడు. నీకు నచ్చినట్టు నేను ఉండనని రీతూపై హరీష్ అరవడంతో.. నాకు నచ్చినట్టు ఉండమని నేను అనలేదంటూ అంతే గట్టిగా సమాధానం చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య హీటెడ్ డిస్కషన్ నడిచింది. ఈ ఇంట్లో గొడవలు రావడానికి కారణం నువ్వే అంటూ రీతూని హరీష్ అన్నాడు. దాంతో రీతూ చౌదరి.. వామ్మో సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు గా అని దండం పెట్టేసింది. మరి ఈ నామినేషన్లు ఎలా ఉన్నాయనేది.. ఎవరెవరి మధ్య హీటెడ్ డిస్కషన్స్ జరిగాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే.
![]() |
![]() |