![]() |
![]() |

ఓజి'(OG)థియేటర్ లో అడుగుపెట్టే ముహూర్తం దగ్గర పడే కొద్దీ, పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ఫ్యాన్స్ ఎనర్జీ రోజు రోజుకి పెరిగిపోతుంది. గ్యాంగ్ స్టార్ గా పవన్ కనిపిస్తుండటంతో పాటు, పవన్ లుక్, ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉండటంతో, 'సిల్వర్ స్క్రీన్ పై 'ఓజి' చేసే మెరుపుల్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఉత్సాహం వాళ్ళల్లో ఉంది. ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
నిన్న 'ఓజి' నుంచి 'గన్స్ ఎన్ రోజెస్'(Guns n roses)సాంగ్ రిలీజ్ అయ్యింది. కంప్లీట్ ఇంగ్లీష్ లిరిక్స్ తో ఉన్న ఈ సాంగ్ కి థమన్ ఇచ్చిన బీట్ అభిమానులతో పాటు, ప్రేక్షకుల్లోను జోష్ ని తెప్పిస్తుంది. పైగా ఈ సాంగ్ కి ఉన్న స్పెషల్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ పోషిస్తున్న' ఓజాస్ గంబీర్ క్యారక్టర్ మూవీలో ఈ విధంగా ఉండబోతుందో అని చెప్పడంతో పాటుగా, మూవీలోని మిగతా క్యారక్టర్ ల యొక్క ప్రాముఖ్యతని, కథ ఎలా ఉండబోతుందో కూడా చెప్పింది. ఇప్పుడు ఈ సాంగ్ 'రికార్డు వ్యూస్' తో ముందుకు దూసుకుపోతుంది. సాధారణంగా కామెంట్ సెక్షన్ లో వేరే హీరోల అభిమానుల్లో ఏ కొంత మందో సాంగ్ బాగోలేదని కామెంట్స్ చెయ్యడంతో పాటు, పలు రకాల విమర్శలు కూడా చేస్తుంటారు. కానీ ఓజి కి అలాంటి నెగిటివ్ కామెంట్స్ రావడం లేదు. చాలా మంది హీరోల అభిమానులు సాంగ్ సూపర్ గా ఉందని, పవన్ ఓజి తో హిట్ అందుకోవడం ఖాయమనే కామెంట్స్ చేస్తున్నారు.
'ఓజి' నుంచి ఇప్పటికే వచ్చిన 'ఫైర్ స్ట్రామ్', 'ట్రాన్స్ ఆఫ్ ఓమి', తో పాటు మెలోడీ సాంగ్ 'సువ్వి సువ్వి' సాంగ్స్ కి కూడా మంచి కామెంట్స్ వినిపించాయి. సెప్టెంబర్ 25 న విడుదలకి సిద్ధమవుతున్న 'ఓజి' లో పవన్ సరసన కన్మణి అనే క్యారక్టర్ లో ప్రియాంక మోహన్(Priyanka Mohan)జత కడుతుండగా, బాలీవుడ్ హీరో 'ఇమ్రాన్ హష్మీ' విలన్ గా 'ఒమీ బా' అనే క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. శ్రీయరెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఫేమ్ దానయ్య (Danayya)పవన్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా సాహూ ఫేమ్ 'సుజిత్'(Sujeeth)దర్శకుడు. ట్రైలర్ అతి త్వరలోనే రిలీజ్ కానుంది.
![]() |
![]() |