![]() |
![]() |
.webp)
ఫస్ట్ జనరేషన్ యాంకర్ ఝాన్సీ గురించి అందరికీ తెలుసు. ఆమె బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఎన్నో మూవీస్ లో కూడా నటించింది. ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. అలాంటి ఝాన్సీ రీసెంట్ గా ఓ విషాద పోస్టు పెట్టారు. తన దగ్గర పనిచేసే శ్రీను అనే పర్సనల్ అసిస్టెంట్ 35 ఏళ్ల వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌తో మరణించాడని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. "శ్రీను, శీను బాబు అని నేను ముద్దుగా పిలుచుకునేదాన్ని.
ఆటను నాకు మెయిన్ సపోర్ట్ సిస్టంగా ఉండేవాడు. అతను హెయిర్ స్టైలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి పర్సనల్ అసిస్టెంట్ గా ఎదిగాడు. నా పనిని చాలా సమర్థవంతంగా నిర్వహించేవాడు. అతను సున్నిత మనస్కుడు, జెన్యూన్ గా, చాల మంచి హ్యూమరస్ పర్సన్ కూడా. అతన్ని నేనొక తమ్ముడి లెక్క చూసుకుంటాను. ఇంత చిన్న వయసులో గుండె పోటుతో మరణించడం నాకు చాల బాధను కలిగిస్తోంది.జీవితం ఒక బుడగలాంటిది" అని సుదీర్ఘ మెసేజ్ ని పెట్టారు. ఝాన్సీ పోస్ట్ మీద హంసానందిని హార్ట్ బ్రోకెన్ అన్నారు, యాంకర్ శిల్పా స్పందిస్తూ షాకింగ్ అని కామెంట్ పెట్టింది. మీకు జరిగిన నష్టానికి సారీ, ఓం శాంతి అంటూ అడివి శేష్ కామెంట్ చేశాడు.
సో స్యాడ్ అంటూ సురేఖా వాణి, ఓం శాంతి అంటూ ప్రగతి ఇలా చాలా మంది సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. అనిత చౌదరి వాట్ ఆర్ యు టాకింగ్...లయ ఐ యాం సారీ అంటూ రెస్పాండ్ అవుతున్నారు. ఇక గాయత్రీ భార్గవి రియాక్ట్ అవుతూ.. ఇది చాలా షాకింగ్‌గా అనిపిస్తోంది.. చాలా దారుణం.. ఆయన చాలా నిజాయితీ గల మనిషి.. నా కెరీర్ ప్రారంభంలో నేను ఆయన్ని చూసాను.. గత వారమే ఆయన్ను కలిశాను.. జీవితం ఊహాతీతం అంటూ ఎమోషనల్ అయింది. సారీ ఝాన్సమ్మ అంటూ నందినీ రెడ్డి ఇలా సెలెబ్రిటీలంతా అంతా కూడా మెసేజెస్ పోస్ట్ చేసి స్పందిస్తున్నారు.
![]() |
![]() |