![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ లో సెకెండ్ వీక్ ఎండ్ కి వచ్చేసింది. ఇక రెండో వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది.
ఇక వీకెండ్ లో శేఖర్ బాషా ఎలిమినేషన్ (Shekar basha elimination) జరిగిందనే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ పోల్స్ లో కిర్రాక్ సీత, పృథ్వీ లీస్ట్ లో ఉండగా.. అనూహ్యంగా శేఖర్ బాషా ఎలిమినేషన్ అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చే కొన్ని లీక్స్ వల్ల ఈ న్యూస్ బయటకొచ్చిందని టాక్ నడుస్తుంది. అసలు ఇది నిజమేనా.. అంటే జరిగే ఛాన్స్ లు వందకి వంద శాతం ఉన్నాయి. ఎందుకంటే ఈ వారమంతా శేఖర్ బాషా పేరు ఒక్క టాస్క్ లో కూడా వినపడలేదు. అసలు అతనికి సంబంధించిన ఫుటేజ్ లేనే లేదు. ఇక కిర్రాక్ సీత గేమ్స్ లో బాగా ఆడింది. అందరితో బాగా ఉంది. కాస్త స్క్రీన్ స్పేస్ కూడా ఉంది. కానీ శేఖర్ బాషాకి సంబంధించిన ఏ కంటెంట్ లేదు. ఇక ఇతడిని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ లు భారీగానే ఉన్నాయి.
శనివారం ప్రోమోలో యష్మీ, ప్రేరణకి ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున . ఇక నాగ మణికంఠ తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. గతవారంతో పోలిస్తే ఈ వారం చాలా మెరుగైన ఆట కనబరిచాడు. ఇక శేఖర్ బాషా ఎలిమినేషన్ అనగానే అటు మీడియా, ఇటు ఏఫ్ఎమ్ అంతా ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇది నిజంగా బిగ్ బాస్ ఇచ్చిన షాక్ అనే చెప్పాలి. మొన్నటి ఎమోషనల్ సర్ ప్రైజ్ ఎపిసోడ్ లో కూడా అతనికి స్క్రీన్ స్పేస్ తక్కువే ఇచ్చారు బిబి టీమ్. అంటే అతడి ఎలిమినేషన్ ముందే ఫిక్స్ అయిందని తెలుస్తుంది. Shocking elimination in Bigg boss 8 అంటూ ట్యాగ్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |