![]() |
![]() |

డాన్స్ మాస్టర్ గా సినీ కెరీర్ ని ప్రారంభించి ఆ పై దర్శకుడుగా, హీరోగా రాణిస్తు సౌత్ సినీ పరిశ్రమలో తన కంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్న వర్సటైల్ పర్సనాలిటీ రాఘవ లారెన్స్(raghava lawrence)ఇప్పుడు హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాడు. పైగా ఈ మూవీకి ఇంకో స్పెషల్ కూడా ఉంది.
లారెన్స్ ఇప్పటి వరకు ఇరవై నాలుగు సినిమాల్లో హీరోగా చేసాడు.ఇప్పుడు తన ఇరవై ఐదవ చిత్రాన్ని క్రేజీ డైరెక్టర్ రమేష్ వర్మ(ramesh varma)దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మేరకు అధికారకంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. పోస్టర్ మీద షాడో అవతార్‌లో ఉన్న లారెన్స్ ఇమేజ్ ఆసక్తి ని రేకెత్తిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో చిత్రీకరణ జరుపుకోబోతున్న ఈ మూవీ ని ఎ స్టూడియోస్,ఎల్ ఎల్ పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ పై విజయవాడ కి చెందిన కె.ఎల్ యూనివర్శిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ(koneru satyanarayana)నిర్మిస్తున్నాడు. ఈయన గతంలో రాక్షసుడు, ఖిలాడీ వంటి సినిమాలని నిర్మించి ఉత్తమ అభిరుచిగల నిర్మాతగా పేరు పొందాడు.ఈ రెండిటికి కూడా రమేష్ వర్మ నే దర్శకుడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జత కలుస్తున్నారు.

నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 సమ్మర్‌లో విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మిగతా నటీనటుల విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |