![]() |
![]() |
.webp)
బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్లకి ఎప్పుడూ లోటు లేదు. ప్రతి సీజన్ ఏదో ఒక లవ్ ట్రాక్ పెట్టి బాగానే నడిపిస్తుంటారు. ఇక ఈ ఏడాది బంపరాఫర్ కొట్టేశాడు బిగ్‌బాస్. ఏకంగా ట్రయాంగిల్ ట్రాక్ దొరికేసింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్‌తో పులిహోర కలుపుతూ రీతూ చౌదరి బాగానే హింట్లు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ.. నువ్వేం చేసినా నిన్నే చూడాలనిపిస్తుంది.. నువ్వు తిడితే తిట్టించుకోవాలనిపిస్తుంది.. నువ్వు నవ్వితే నీతో నవ్వాలనిపిస్తుందంటూ రీతూ చౌదరి నిబ్బా డైలాగులు కొట్టింది.
ఇక మరోవైపు నుండి డీమాన్ తన లవ్ ట్రాక్ ని స్టార్ట్ చేశాడు. లైవ్ ఎపిసోడ్ లో.. రీతూ చౌదరి గిన్నెలు క్లీన్ చేస్తుంటే. మనోడు టిప్ టాప్‌గా రెడీ అయ్యి వచ్చి ఆమె పక్కనే నిలబడ్డాడు. ఇద్దరి మధ్య గాలికూడా ఆడనంత దగ్గరగా వచ్చి స్టార్ట్ చేశాడు. ఏంటి నువ్వూ మాట్లాడటం లేదు ఈ మధ్య.. అప్పుడు రీతూ చౌదరి చూసిందయ్యా చూపులూ.. కత్తులే. అటు నుంచి డీమాన్ పవన్ అయితే అలా చూస్తూనే ఉన్నాడు.
.webp)
పెద్ద పెద్ద కళ్లు వేసుకుని రెప్పకూడా వేయకుండా.. డీమాన్ పవన్‌ని అలా చూసేసరికి వీడు మొత్తం మర్చిపోయి ఊహల్లో తేలిపోతున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కళ్లలోకి కళ్లు పెట్టి చూసుకున్నారు. ఏంటీ.. చెప్పు అని రీతు అనగా.. ఏంటీ.. నువ్వే చెప్పు అంటూ డీమాన్ పవన్ అన్నాడు. లైవ్ ఎపిసోడ్ లో రీతు చౌదరి, డీమాన్ పవన్ ఇద్దరు లవర్స్ మాదిరి చేస్తున్నారు. వీళ్ళ మాటలు, చూపులు, చేష్టలు చూస్తుంటే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. ఆ తర్వాత డీమాన్, రీతు దగ్గరికి మళ్ళీ వచ్చాడు. ఏంటీ రీతూ.. నేను ఉదయం కనిపించకపోయే సరికి కోపం వస్తుందా.. నీకో విషయం తెలుసా రీతూ.. ఆ బ్లూ డ్రెస్ నీ కోసమే వేసుకుని వచ్చా. కానీ నన్ను అస్సలు చూడలేదు. ఎంత ఫీల్ అయ్యానో.. ఆ డ్రెస్ నీకు ఇష్టమని.. దాన్ని నువ్వు చూడాలని నీకోసమే వేసుకుని తిరుగుతున్నానంటూ డీమాన్ పవన్ చెప్పాడు. ఇక ఈ పులిహోర అవ్వగానే అద్దం ముందుకు వెళ్ళి చూసుకొని సిగ్గుపడిపోయాడు డీమాన్. ఇక అప్పుడే వచ్చిన సంజన.. ఏంటీ పడిపోయావా.. చూస్తున్నా చూస్తున్నానని అంది. ఆ మాటతో అప్పటివరకు సిగ్గుపడ్డ డీమాన్.. నేను అంత ఈజీగా పడను.. నాకు సింగిల్‌గా ఉండటమే ఇష్టమని కవర్ చేశాడు. ఇదంతా ఫేక్ అని లోపలున్న హౌస్ మేట్స్ కే కాదు చూసే ఆడియన్స్ కి కూడా తెలుసు. మరి వీరి నిబ్బా లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తోందో కామెంట్ చేయండి.
![]() |
![]() |