![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -466 లో..... శౌర్యా బర్త్ డే కి పారిజాతం కేక్ తీసుకొని వస్తుంది. అయిన నువ్వు తీసుకొని రావడం ఏంటి అని జ్యోత్స్న అడుగుతుంది. శివన్నారాయణ తీసుకొని రమ్మన్న విషయం గుర్తు చేసుకుంటుంది పారిజాతం. ఎలా వచ్చావని జ్యోత్స్న అడుగగా నేనే తీసుకొని వచ్చానని శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. మావయ్య గారు నమస్తే అని శ్రీధర్ అనగానే హా నమస్తే అని అయిష్టంగా సమాధానమిస్తాడు శివన్నారాయణ.
ఆ తర్వాత ఒరేయ్ కార్తీక్ నేను వచ్చింది శౌర్యా బర్త్ డే కోసమే కాదు ఇంకొక మనిషిని ప్రాణధాతని కలవడానికి కూడా వచ్చానని సుమిత్ర అంటుంది. అసలు ప్రాణధాత ఏంటని అందరు ఆశ్చర్యంగా చూస్తుంటే కార్తీక్ ని కాపాడిందని జరిగింది మొత్తం పారిజాతం చెప్తుంది. ఆ రోజు నీకేమైనా అయితే నా కూతురు చేసిన పనికి నేను జీవితాంతం బాధపడే దాన్ని.. నీకు ప్రాణధాత అంటే నాక్కూడా ప్రాణధాత తనని కలిసి ఋణం తీర్చుకోవాలని సుమిత్ర అంటుంది. అందరూ నేను ప్రాణధాతని కలవాలని అంటారు. ఇప్పుడు కాదు కేక్ కటింగ్ అయ్యాక అని కార్తీక్ అంటాడు. అసలు బావ ఏం చేయబోతున్నాడని దీప అనుకుంటుంది. ఆ తర్వాత దాస్ కి పారిజాతం ఫోన్ చేసి.. కాశీ గాడి గురించి నాకు ఎందుకు చెప్పలేదని అడుగతుంది. జ్యోత్స్న కి చెప్పాను హెల్ప్ చెయ్యమన్నాను కానీ చెయ్యలేదని దాస్ చెప్తాడు. అప్పుడే పారిజాతం దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. పారిజాతానికి జ్యోత్స్న అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ఎంత మోసం చేసావే అని పారిజాతం మనసులో అనుకుంటుంది. మనం తర్వాత మాట్లాడకుందామని పారిజాతం లోపలికి వెళ్తుంది.
కేక్ కటింగ్ అయ్యాక.. నీ సోషల్ సర్వీస్ బాగుందని జ్యోత్స్న అంటుంది. కన్నకూతురు అయితే బాధ్యత అవుతుంది. ఇలా వేరే వాళ్ళ కూతురికి బర్త్ డే చేస్తే సోషల్ సర్వీస్ అవుతుందని జ్యోత్స్న అనగానే దశరథ్ కోప్పడతాడు. నేను అన్నది తప్పు అని ఇక్కడ ఎవరితో అయిన అనిపించు బావ అని జ్యోత్స్న అంటుంది. నువ్వు మాట్లాడింది తప్పు అని నేనంటున్నానని పారిజాతం అంటుంది. రక్తసంబంధం గురించి నువ్వు మాట్లాడకు.. దానికి విలువ లేదని పారిజాతం మాట్లాడుతుంటుంది. ఇన్నాళ్లకి కరెక్ట్ గా మాట్లాడావని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |