![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -60 లో......గంగ డల్ గా కూర్చొని ఉంటుంది. ఏమైందని పెద్దసారు అడుగుతాడు. ఈ రోజు నా పుట్టినరోజు కానీ మా అమ్మ నన్ను గుడికి తీసుకొని వెళ్ళేది.. నాకు నచ్చినవి చేసి పెట్టేదని ఫీల్ అవుతుంది. పాపం లక్ష్మి గంగ సొంతకూతురు కాకపోయినా బాగా చూసుకుందని పెద్దసారు అనుకుంటాడు.
ఆ తర్వాత లక్ష్మీ ఒక దగ్గర కళ్ళు తిరిగిపడిపోతుంది. రుద్ర సంరక్షణ లో పెరుగుతున్న పాప చిన్ని.. లక్ష్మీని చూసి వాటర్ ఇచ్చి కూర్చోపెడుతుంది. లక్ష్మీ వెళ్తుంటే.. ఆగండి నీరసంగా ఉన్నారని చిన్ని అంటుంది. పని చూసుకోవాలని లక్ష్మీ అంటుంది. నీకు పని కావాలి కదా అని చెప్పి వాళ్ళ మేడమ్ దగ్గర ఫోన్ తీసుకొని రుద్రకి ఫోన్ చేసి ఒకరికి హెల్ప్ కావాలి త్వరగా రమ్మని చెప్తుంది. రుద్ర బయల్దేరి వెళ్తుంటే పెద్దసారు ఆపి.. ఈ రోజు గంగ పుట్టినరోజు.. గుడి దగ్గర డ్రాప్ చెయ్యమని చెప్తాడు. రుద్ర షాపింగ్ మాల్ దగ్గర ఆపి గంగకి విషెస్ చెప్తాడు. కొత్త బట్టలు కొనుక్కోమని చెప్తాడు. వద్దని గంగ అంటుంది. డబ్బు నీ శాలరీ నుండి కట్ చేస్తారులే అని రుద్ర అనగానే గంగ సరే అంటుంది.
గంగ తక్కువ కాస్ట్ లో డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటుంది. మరొకవైపు సైదులు కత్తి పట్టుకొని గంగని ఫాలో అవుతాడు. ట్రయల్ రూమ్ లో సైదులు ఉంటాడు. అప్పుడే వీరు ఫోన్ చేస్తాడు.. పని పూర్తి అవుతుందని సైదులు చెప్తాడు. తరువాయి భాగంలో గంగకి రుద్ర డ్రెస్ సెలక్ట్ చేసి ట్రయల్ కి వెళ్ళమంటాడు. రుద్రకి రూమ్ నుండి ఏదో సౌండ్ వస్తుంది. గంగ డోర్ తియ్యగానే సైదులు కత్తితో ఎటాక్ చేస్తాడు. రుద్ర ఆపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |