![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -272 లో.....విశ్వ, భద్రవతి ని భాగ్యం ఇంటికి పిలిపించుకొని మీ ప్రేమ పెళ్లి కి ముందే ఒకబ్బాయిని ప్రేమించిందట.. ఆ అబ్బాయికి మీ ప్రేమకి సంబంధం ఉందని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారట అని భాగ్యం చెప్పగానే భద్రవతి, విశ్వ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు.
మరొకవైపు ప్రేమ ఇంటికి వస్తుంది. రాగానే రామరాజు ఇంట్లో అందరిని అక్కడ నుండి వెళ్ళమని ప్రేమకి ఆ ఫోటో చూపించి ఎవరు ఇతను అని అడుగుతాడు. ప్రేమ సైలెంట్ గా ఉంటుంది. అప్పుడే రామరాజు ఇంటికి సేనాపతి, విశ్వ గొడవకి వస్తారు. నా కూతురిని ఇంట్లో అవమానిస్తున్నారని రామరాజుపై ఎగబడుతారు.ఆ తర్వాత వాళ్ళు గొడవ పడుతుంటే ధీరజ్ వచ్చి.. నా భార్య గురించి అందరు ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. వాడు నాకు ఫ్రెండ్ కానీ పెద్ద వెధవ.. తనతో ఉన్న ఫొటోస్ పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
నా భార్య నేను ఒకరికొకరం ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం.. ఎప్పుడు కలిసే ఉంటాం.. దయచేసి తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడకండి అని ప్రేమ భుజం పై చెయ్ వేసి ధీరజ్ చెప్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. వేదవతి, నర్మద హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరు ఇంట్లోకి వెళ్తారు. మరొక వైపు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని భాగ్యం ఒకవైపు.. మరొకవైపు శ్రీవల్లి డిస్సపాయింట్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |