![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 సెకెండ్ వీక్ లో నిన్న మొన్నటి వరకు నామినేషన్లతో హౌస్ హీటెక్కింది. అయితే హౌస్ లో రెండవ వారం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ప్రస్తుతం హౌస్ లో రెంటర్స్ గా ఏడుగురు.. ఓనర్స్ గా ఏడుగురు ఉన్నారు. కాలచక్రం అనే టాస్క్ బిగ్ బాస్ ఇచ్చాడు. దానికి టైమర్ ఉంటుంది. ఆ టాస్క్ అయిపోయేవరకు ఎవరు పడుకోవద్దు.. టాస్క్ గెలిస్తే వన్ అవర్ స్లీప్ లెస్ అవర్ తగ్గుతుంది.
ఈ టాస్క్ లో ఓనర్స్ నుండి ప్రియ సంచాలకులు.. రెంటర్స్ నుండి తనూజ సంచాలకులుగా ఉన్నారు. అసలు టాస్క్ ఏంటంటే.. ఒక చక్రంపై ఇరు టీమ్ లు చెయ్ తో పట్టుకొని ఉంటారు. అందులో చెయ్ పెట్టుకోకుండా ఆపి వాళ్ళు పట్టుకున్న చక్రాన్ని పట్టుకుంటే వాళ్ళు విన్ అవుతారు. ఇందులో ఆ చక్రం పట్టుకోకుండా వాళ్ళని ఆపుకోవచ్చు. భరణి, ఇమ్మాన్యుయల్ ని గట్టిగా లాక్ చేస్తాడు. అసలు రెంటర్స్ టీమ్ లో ఇమ్మాన్యుయల్, రాము, సుమన్ శెట్టి మేల్ కంటెస్టెంట్స్.. ఓనర్స్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడం వల్ల ఓనర్స్ విన్ అవుతారు.
కెప్టెన్సీ టాస్క్ లో టాస్క్ లు గెలిచే కొద్దీ స్లీప్ లెస్ అవర్స్ తగ్గుతాయి. నిద్రపోకుండా ఉండడానికి ఇరు టీమ్ లు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓనర్స్ అయితే రెంటర్స్ కి సంబంధించిన ఫుడ్, ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ ని ప్రియ, శ్రీజ దాచేస్తారు. ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ లో లీడ్ లో ఉన్నది ఓనర్స్. మరి ఈ టాస్క్ లో గెలిచిందెవరొ తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే .
![]() |
![]() |