![]() |
![]() |

బిగ్ బాస్ అగ్నిపరీక్ష దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దాంతో టాస్కులన్నీ కూడా ఫుల్ టఫ్ గా ప్లాన్ చేస్తోంది టీమ్. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ ఇక ఇందులో రెండు ఇంటర్ కనెక్షన్ టాస్కులు ఇచ్చారు. ముందుగా టాగ్స్ ఇమ్మని చెప్పి ఎవరు ఎవరికీ టాగ్స్ ఇచ్చారో ఆ ఇద్దరినీ ఒక జోడీగా చేసి బ్లైండ్ ఫోల్డ్ టాస్క్ ఆడించారు. అంటే తోలు బొమ్మలాటను ఆడించారు. ఒక వ్యక్తి కళ్ళకు గంతలు కట్టించేసింది. టేబుల్ మీద కొన్ని గిన్నెలు, ఒక ప్లేట్ లో స్వీట్స్ పెట్టింది. వాళ్ళను ఆడించేవాళ్లను వెనక నిలబెట్టింది శ్రీముఖి. తర్వాత ఒక కార్డు చూపించి ఆ కార్డులో ఉన్న స్వీట్ ని ఆ కళ్ళకు గంతలు కట్టుకున్న వ్యక్తితో సరిగా గుర్తించేలా చేసి ఆ స్వీట్ ని గిన్నెలో వేయించి వెంటనే వచ్చి గంట గొట్టాలి.
.webp)
ఐతే ఇందులో షాకిబ్ తన తోలుబొమ్మ ప్రియాతో స్వీట్స్ ని అలా వేయిస్తూ ప్రాక్టీస్ చేయిస్తూనే ఉన్నాడు. అప్పటికే టాస్క్ ఐపోయింది. ఇక శ్రీముఖి ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది. "షకీబ్ ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తున్నావో చెప్తావా.. నాకు తెలియాలి ఇప్పుడు ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తున్నావో...రూల్స్ అర్ధం కావట్లేదా నీకు. ఈ ఆటలు ప్రాక్టీస్ లు చేసుకుని దాని తర్వాత ఆడతారా ? " అంటూ మండిపడింది. ఇక నవదీప్ ఐతే డిస్కషన్ ఎందుకు ఈ టీమ్ అవుట్ అని చెప్పేసాడు. ఇక విన్నింగ్ జోడిగా నాగా - ప్రసన్న గెలిచారు. ఇక ఫస్ట్ టైం ప్రసన్న ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ప్రసన్న, షాకిబ్ కి నవదీప్ ఎల్లో కార్డ్స్ ఇచ్చాడు.
![]() |
![]() |