Home  »  News  »  వెలుగులోకి రామాయణ సీక్రెట్..ఆ రాష్ట్రంలోని ప్రాగ్జ్యోతిష్యపురంతో రాముడికి ఉన్న లింక్ ఏంటి?

Updated : Aug 3, 2026

 

భారతీయ సినీ ప్రేమికులతో పాటు రామ భక్తులంతా దీపావళి(Diwali)కానుకగా నవంబర్ 8న రాబోయే  రామాయణ(Ramayana)పార్ట్ 1 కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఇటీవల రిలీజైన ట్రైలర్ ని పదే పదే తనివితీరా చూసుకుంటూ జై శ్రీరామ్ అంటూ మురిసిపోతున్నారు. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్  తమ క్యారక్టర్లతో ఎలా తమ హృదయాల్లో సజీవంగా నిలవబోతున్నారనే క్యూరియాసిటీ కూడా ఆ అందరిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40కి పైగా భాషల్లో విడుదల కాబోతున్న రామాయణ చుట్టూ ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన చారిత్రక అంశం సోషల్ మీడియా వేదికగా  చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా రామాయణం కథ అనగానే మన అందరికీ వెంటనే గుర్తుకువచ్చే ప్రాంతాలు అయోధ్య, దండకారణ్యం, కిష్కింధ మరియు లంక మాత్రమే. కానీ మన ప్రాచీన భారతదేశ ఇతిహాసాలకు, ఈశాన్య భారత భూభాగమైన అస్సాం ప్రాంతానికి మధ్య ఉన్న నమ్మశక్యం కాని అనుబంధం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామాయణం కేవలం మన దేశ పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకే పరిమితం కాలేదని, ఈశాన్య భారతం కూడా ఈ మహాకావ్యంలో కీలక పాత్ర పోషించిందనే విషయం వెలుగులోకి రావడం విశేషం. ఈ సరికొత్త చర్చకు ప్రధాన కారణం ప్రముఖ చరిత్రకారుడు, రచయిత డాక్టర్ సౌరదీప్ నాథ్ చేసిన సంచలన వ్యాఖ్యలే.  రణ్‌బీర్ అల్లాహాబాదియా నిర్వహిస్తున్న ప్రసిద్ధ 'బీర్‌బైసెప్స్' (BeerBiceps) పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో డాక్టర్ సౌరదీప్ నాథ్ పాల్గొని, ప్రాచీన భారతీయ గ్రంథాలలో అస్సాం ప్రాధాన్యతను సవివరంగా విశ్లేషించారు. ఆయన మాట్లాడుతూ' ప్రాచీన కాలంలో 'ప్రాగ్జ్యోతిష్యపురం' అని పిలువబడిన నేటి అస్సాం భూభాగ ప్రస్తావనలు రామాయణం, మహాభారతం వంటి మహత్తర ఇతిహాసాల్లో స్పష్టంగా కనిపించేవి. రామాయణంలోని కిష్కింధ కాండలో సుగ్రీవుడు వానర వీరులను సీతాదేవి అన్వేషణ కోసం నలుదిక్కులకూ పంపే సన్నివేశం అత్యంత కీలకమైనది. ఆ సమయంలో తూర్పు దిక్కుకు వెళ్లే వానర సమూహానికి మార్గనిర్దేశం చేస్తూ, ప్రాగ్జ్యోతిష్యపురం గురించిన ప్రస్తావన వస్తుందని చెప్పాడు. 


Also read: ధనుష్ పొలిటికల్ ఎంట్రీ? అరుణాచలంలో రజినీకాంత్ మనవళ్లతో ప్రత్యేక పూజలు


దీంతో 'రామాయణ' లోని భౌగోళిక విస్తృతిని, భారతీయ సంస్కృతిలోని వివిధ ప్రాంతాల ప్రాముఖ్యతను దృశ్యరూపంలో ఎంతో ప్రామాణికంగా చూపించబోతున్నారనే వార్తలు అభిమానుల్లో అంచనాలని  రెట్టింపు చేశాయి.నితేష్ తివారీ దర్శకత్వంలో  4000 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న   ఒక్కో భాగానికి సుమారు రూ. 2000 కోట్లు వెచ్చిస్తూ, ఏకంగా 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న విఎఫ్ఎక్స్ (VFX) స్టూడియోల భాగస్వామ్యంతో రూపొందిస్తున్నారు.

 


Ramayana, RanbirKapoor, Sai Pallavi, Yash, Nitesh Tiwari, Namith Malhotra
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.