Home  »  News  »  సినిమా వచ్చాక మైండ్ బ్లాక్.. 'టాక్సిక్' ట్రోల్స్ పై హుమా ఖురేషి షాకింగ్ కామెంట్స్.!

Updated : Aug 3, 2026

పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' నుంచి 'తబాహి' అనే సాంగ్ బయటకొచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ సాంగ్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మధ్య ఉన్న కొన్ని ఇంటిమేట్ సీన్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. పెళ్లైన ఒక మహిళ అయ్యుండి కియారా ఇలాంటి సీన్స్ ఎలా చేస్తుంది అని కొందరు నీతులు చెబుతూ.. ఆమెతో పాటు, ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రాను కూడా టార్గెట్ చేస్తూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ పాటలో నటించిన మన హీరో యశ్ కి కూడా పెళ్లై పిల్లలు ఉన్నారు. కానీ ఆయన విషయంలో ఎవరూ ఒక్క మాట కూడా అనడం లేదు. మరి అదే సీన్‌లో కనిపించిన కియారాను మాత్రం ఎందుకు వేధిస్తున్నారు? ఈ జెండర్ డబుల్ స్టాండర్డ్స్‌పై ఇప్పుడు బాలీవుడ్ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

ఈ వివాదంపై ప్రముఖ నటి, ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న హుమా ఖురేషి ఘాటుగా స్పందించారు. ఒక ప్రముఖ టాక్ షోలో మాట్లాడిన హుమా ఖురేషి.. ఈ రకమైన ట్రోలింగ్‌ను "సిక్ అండ్ డిస్‌గస్టింగ్" అని అభివర్ణించారు. సమాజంలో కొంతమంది మనస్తత్వం ఎంత దారుణంగా ఉందో ఈ ట్రోల్స్ నిరూపిస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుమా ఖురేషి మాటల్లోనే చెప్పాలంటే.. "ఈ రకమైన నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్న జనాన్ని మనం మాటలతో మార్చలేం. దానికి వివరణలు ఇచ్చుకుంటూ కాలయాపన చేయడం అనవసరం. అసలైన సమాధానం ఆగస్టు 26న థియేటర్లలో 'టాక్సిక్' సినిమా రూపంలో వస్తుంది. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ప్రదర్శించిన ప్రతిభతో వీరందరికీ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇస్తారని, చివరికి విజయానందం మాదే" అన్నారు. నిజ జీవితంలో సమాజం ఎంతో దయతో కూడుకుని ఉన్నప్పటికీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచం మాత్రం చాలా విషపూరితంగా తయారైందని ఆమె ఆవేదన చెందారు.

అంతేకాకుండా, ఈ సినిమాలో నటించిన విదేశీ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా కియారా అద్వానీకి మద్దతుగా నిలిచారు. "నటుల పని ఒక కథలోని పాత్రలకు జీవం పోయడం. కెమెరా ముందు అలా కనిపించడం వారి వృత్తిధర్మం. యశ్ కి పెళ్లై పిల్లలు ఉన్నప్పుడు లేని అభ్యంతరం, కియారా విషయంలోనే ఎందుకు వస్తోంది? పురుషుడికి ప్రశంసలు, స్త్రీకి నిందలా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 

కేజీఎఫ్ తర్వాత యశ్ నటించిన సినిమా కావడంతో 'టాక్సిక్'పై భారీ అంచనాలు ఉన్నాయి. కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి లాంటి ప్రముఖ తారగణంతో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Toxic Movie, Tabaahi Song, Yash, Kiara Advani, Huma Qureshi






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.