![]() |
![]() |
.webp)
'దేవర'(Devara)తో 2024 ని 'దేవర నామ సంవత్సరంగా' మార్చిన ఎన్టీఆర్(Ntr)అభిమానులు, ఇప్పుడు 'వార్ 2'(War 2)తో 2025 ని 'హృతిక్ రామారావు' నామ సంవత్సరంగా మార్చడనికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హృతిక్ మాట్లాడుతు వార్ 2 తో ఒక కొత్త ఎన్టీఆర్ ని చూడబోతున్నారు. ,ఎన్టీఆర్ నటన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా నెక్స్ట్ సినిమాలకి ఆ తరహాని అప్లై చేస్తానని చెప్పడం జరిగింది. దీంతో వార్ 2 లో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనని సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి అభిమానులతో పాటు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించాడనే టాక్ కూడా సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది.
వార్ 2 తెలుగు, హిందీతో పాటు తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఎన్టీఆర్, హృతిక్ లాంటి బిగ్ స్టార్స్ కావడంతో, వార్ 2 ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని తమిళ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు వార్ 2 కి తమిళనాట థియేటర్స్ తక్కువ దొరుకుతున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వార్ 2 రిలీజ్ రోజైన ఆగస్టు 14 న 'సూపర్ స్టార్ రజనీకాంత్'(Rajinikanth)సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున(King Nagarjuna)ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ లో చేస్తుండటం, లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)దర్శకుడు కావడంతో, కూలీపై తమిళ నాట భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో కూలీ కి ఎక్కువ థియేటర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
ఇక వార్ 2 ఏపి, తెలంగాణ తో పాటు నార్త్ లో అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతుంది. దీంతో తొలి రోజు రికార్డు కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉన్నట్టుగా సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఓవర్ సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పింది. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన వార్ 2 ని అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee)దర్శకత్వం వహించగా, నాలుగు దశాబ్దాల పై నుంచి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని నిర్మిస్తు వస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) నిర్మించింది. కియారా అద్వానీ(Kiara Advani)కథానాయిక. సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలుగులో రిలీజ్ చేస్తుంది.
![]() |
![]() |