![]() |
![]() |

విజయ్ దేవరకొండ(Vijay deverakonda),జర్సీ మూవీ ఫేమ్ 'గౌతమ్ తిన్ననూరి'(Gowtam tinnanuri)కాంబినేషన్ లో గత నెల 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'కింగ్డమ్'(Kingdom). యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ 'సూరి' గా రెండు పార్శ్యాలు నిండిన క్యారక్టర్ లో అత్యద్భుతంగా నటించాడని అభిమానులు ముక్త కంఠంతో చెప్తున్నారు. సాంకేతిక ప్రమాణాల పరంగా కూడా మూవీ ఉన్నత స్థాయిలో ఉందనే మాటలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి
'కింగ్డమ్' ఓటిటి హక్కులని ప్రముఖ నిర్మాణ సంస్థ 'నెట్ ఫ్లిక్స్'(Netflix)దక్కించుకున్న విషయం తెలిసిందే. ఓటిటి రిలీజ్ డేట్ ని సదరు సంస్థ ఇంకా అధికారంగా ప్రకటించలేదు. కానీ 'కింగ్ డమ్' ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతుందని, మేకర్స్ మరికొన్నిరోజుల్లో సదరు డేట్ పై అధికార ప్రకటన కూడా ఇవ్వనున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్థుతానికి అయితే
థియేటర్స్ లో కింగ్డమ్ రెండో వారంలో కొనసాగుతు ఉంది. ఈ సమయంలో ఓటిటి డేట్ వార్తలు సోషల్ మీడియాలో వస్తుండటం వైరల్ గా మారింది.
సితార ఎంటర్ టైన్ మెంట్ పై సూర్యదేవర నాగవంశీ(Nagavamsi)నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ కి అన్నయ్యగా శివ అనే క్యారక్టర్ లో 'సత్యదేవ్' నటించాడు. సదరు క్యారక్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే(Bhaghyashri Borse)చెయ్యగా, మనీష్ చౌదరి, అయ్యప్ప పి శర్మ, గోపరాజు రమణ,బాబురాజ్ తదితరులు మిగతా పాత్రల్లో కనిపించారు. అనిరుద్(Anirudh Ravichander)సంగీతాన్ని అందించాడు. కింగ్డమ్ ఇప్పటి వరకు 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.
![]() |
![]() |