Home

»

Latest News

`మెగా 156`లోనూ మ‌రో స్టార్ హీరో!?

Apr 22, 2022 5:08PM

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం `ఆచార్య‌` ఈ నెల 29న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇందులో త‌న త‌న‌యుడు, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరు. అలాగే, `ఆచార్య‌` త‌రువాత వ‌స్తున్న‌ `గాడ్ ఫాద‌ర్`లోనూ బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ తో క‌లిసి సంద‌డి చేయ‌బోతున్నారు మెగాస్టార్. అదే విధంగా, `మెగా 154`లోనూ మాస్ మ‌హారాజా ర‌వితేజ ఓ ముఖ్య పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు.. `భోళా శంక‌ర్`లోనూ చిరు చెల్లెలు పాత్ర‌ధారిణి కీర్తి సురేశ్ కి జంట‌గా యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య న‌టించ‌బోతున్న‌ట్లు టాక్. అంటే.. `ఆచార్య‌` నుంచి `భోళా శంక‌ర్` వ‌ర‌కు చిరు ప్ర‌తీ చిత్రంలోనూ మ‌రో హీరోకి కూడా స్థాన‌ముంద‌న్న‌మాట‌.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. `ఛ‌లో`, `భీష్మ‌` చిత్రాల ద‌ర్శ‌కుడు వెంకీ కుడుమ‌ల కాంబినేష‌న్ లో చిరు చేయ‌బోతున్న సినిమాలోనూ ఓ స్టార్ హీరో న‌టించే అవ‌కాశ‌ముంద‌ట‌. `మెగా 156` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొంద‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వెంకీ మార్క్ ఎంట‌ర్టైన్మెంట్ తో సాగే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని టాక్. అంతేకాదు.. క‌థానుసారం చిరుతో పాటు మ‌రో స్టార్ కి కూడా ఈ మూవీలో స్కోప్ ఉంద‌ట‌. ప్ర‌స్తుతం ఆ స్టార్ కోసం అన్వేష‌ణ సాగుతోంద‌ట‌. మ‌రి.. `మెగా 156`లో చిరుతో న‌టించ‌బోయే ఆ స్టార్ ఎవ‌రో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com