![]() |
![]() |

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ అగ్రహీరోగా ఎదిగిన నటుడు మాస్ మహారాజ రవితేజ. తెలుగు సినీ పరిశ్రమలోకి రావాలని ఆశపడే చాలా మందికి రవితేజ ఒక ఇన్స్పిరేషన్. రవితేజ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఆయన ఫాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు సైతం థియేటర్స్ కి క్యూ కడతారు. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ తన అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది. అలాగే పూనకాలు లోడింగ్ అంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రహీరోల్లో రవితేజ ఒకడు. ఆయన యాక్టింగ్ కి, డైలాగ్ డెలివరీ కి ఉన్న శక్తీ ఏ పాటిదో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సినీ ప్రేక్షకులకి బాగా తెలుసు. కింద పడ్డ ప్రతిసారి నేలకి బలంగా కొట్టిన బంతిలా పైకి లేచి తన సత్తాని చూపడంలో ఎప్పుడు ముందు ఉంటాడు. ఇప్పుడు లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ తోప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్టూవర్టుపురం అనే గ్రామానికి చెందిన కరుడుగట్టిన దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని టాలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది. ఆ మాటలకి తగ్గట్టే టైగర్ నాగేశ్వరరావు టీజర్ కూడా రూపొంది ప్రేక్షకుల్లో రవితేజ అభిమానుల్లో సినిమా మీద అంచనాలు పెంచుకునేలా చేసింది. ఇప్పుడు వాళ్ళ అంచనాలని రెట్టింపు చెయ్యడానికి అక్టోబర్ 3 న టైగర్ నాగేశ్వరావు సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వబోతుంది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం అధికారంగా సినిమాకి సంబంధిన పోస్టర్ తో ప్రకటనని ఇచ్చింది. దీంతో రవితేజ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సారి మా రవితేజ సాలిడ్ హిట్ కొట్టడం గ్యారంటీ అని అంటున్నారు.

మాస్ మహారాజ కెరియర్ లోనే మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవ్వబోతున్న ఈ టైగర్ నాగేశ్వరావు మూవీ ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా వంశీకృష్ణ దర్శకత్వం వహించడం జరుగుతుంది. అలాగే ఈ మూవీకి ఉన్న ఇంకో స్పెషల్ ఏంటంటే సుదీర్ఘ కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణుదేశాయ్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన క్యారక్టర్ ని పోషించడం జరిగింది.
![]() |
![]() |