![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమాలో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిద్దో ఆడే పండుగాడు అనే డైలాగ్ ని చెప్తాడు. ఏ ముహూర్తాన మహేష్ ఆ డైలాగ్ చెప్పాడో గాని ఇప్పుడు ఆ మాట అక్షర సత్యంగా నిలిచింది. తన నయా మూవీ గుంటూరు కారంతో ఎవరికీ సాధ్యం కానీ ఒక రికార్డుని సృష్టించి తెలుగు చిత్ర పరిశ్రమకి తనెంత స్పెషల్ హీరోనో మరోసారి చాటి చెప్పాడు.
హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ మల్టిప్లెక్స్ థియేటర్ ప్రసాద్స్ ఐమాక్స్ లో గుంటూరు కారం కి సంబంధించి ఫస్ట్ డే 41 షోస్ పడనున్నాయి. ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం అధికారకంగా ప్రకటించింది. దీంతో ఇండియన్ సినిమా హిస్టరీ లో ప్రసాద్ ఐమాక్స్ లో 41 షోస్ పడుతున్న మొట్టమొదటి చిత్రంగా గుంటూరు కారం నిలిచింది. ఆల్రెడీ బుక్ మై షో లాంటి ఆన్ లైన్ యాప్స్ లో టికెట్స్ కూడా ఫుల్ అయిపోవడం గమనార్హం.
ఇప్పుడు ఈ విషయంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. పైగా మహేష్ నుంచి సినిమా రావడం లేట్ అయినా కూడా మహేష్ రేంజ్ మాత్రం తగ్గదు అని అంటున్నారు. జనవరి 12 తెల్లవారు జామున ఒంటి గంట నుంచే గుంటూరు కారం షోస్ పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో పడనున్నాయి. ఆల్రెడీ థియేటర్స్ దగ్గర మహేష్ అభిమానుల హాడావిడీ మొదలయ్యింది. పెద్ద ఎత్తున మహేష్ కటౌట్ లని ఏర్పాట్లు చేస్తు బాబు లాండ్ అయ్యాడంటే అపోజిషన్ కి బ్యాండే అంటూ సందడి చేస్తున్నారు.
![]() |
![]() |