![]() |
![]() |

నవీన్ పోలిశెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ ఫేవరేట్‌గా మారిన పేరిది. ఇటీవల విడుదలైన 'జాతిరత్నాలు' చిత్రంలో తనదైన టైమింగ్‌తో ఆకట్టుకుంటూ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో వార్తల్లో నిలిచిన ఈ హీరో తనకు పెళ్లి కాదని ఫిక్సైపోయాడట. ఈ షాకింగ్ విషయాన్ని అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వెల్లడించి షాకిచ్చారు.
షోలోకి ఓ రేంజ్‌లో ఎంటరైన నవీన్ పొలిశెట్టిని 'కినువా' వ్యాపారం ఎలా వుందని అలీ అడిగితే.. గుక్క తిప్పుకోకుండా నవీన్ పోలిశెట్టి సింగిల్ టేక్‌లో చెప్పిన తీరు అలీనే విస్మయానికి గురిచేసింది. అలాగే విజయ్ దేవరకొండతో వున్న అనుబంధం, ప్రభాస్‌తో తనకున్న పరిచయం గురించి తన స్టైల్లో చెప్పుకొచ్చాడు. "ఈ సిన్మా విన్నప్పట్నుంచీ, ఈ సిన్మా రిలీజయ్యాక మాకు పెళ్లి సంబంధాలు రావని ఫిక్స్.. ఈ జోగిపేటలో బాబోయ్ ఇంత చిల్లరగాళ్లు ఉంటారా?" అని జనం అనుకుంటున్నారని అన్నాడు.
నవీన్ పోలిశెట్టిని 54 సార్లు రిజెక్ట్ చేసిన వాళ్లెవరు?.. అతన్ని ఎందుకు రిజెక్ట్ చేశారు. నవీన్ పోలిశెట్టి నకిలీ నివిన్ పాలీ (మలయాళం స్టార్) అని ఎవరన్నారు?.. నవీన్ ప్రస్తుతం ఎవరి ప్రేమలో వున్నాడు?.. సినిమా చూసి బయటికి వస్తున్న ఆడియన్స్ కోతిరత్నాలు అంటున్నారా?.. వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వారం ప్రసారమయ్యే "ఆలీతో సరదాగా" చూడాల్సిందే. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.
![]() |
![]() |