![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు టాలీవుడ్ లో చిచ్చు రేపుతున్నాయి. రాజకీయ ఎన్నికలను తలపిస్తూ ఆర్టిస్ట్ లు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మా అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ కి మద్దతు ఇస్తున్న మెగా బ్రదర్ నాగబాబు.. ప్రత్యర్థి మంచు విష్ణుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
"ప్రకాష్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవు. ప్రకాష్ రాజ్ కింది స్థాయి నుంచి వచ్చాడు. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు. నటుడి కష్టాలు ఎలా ఉంటాయో తెలిసిన వాడు అధ్యక్షడు అయితేనే నటుల గురించి ఆలోచిస్తాడు" అని నాగబాబు అన్నారు. "మంచు విష్ణు మోహన్ బాబు కొడుకు. అంతకంటే ఏమీ లేదు. మోహన్ బాబు కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వారే. ప్రకాష్ రాజ్ తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలి. కానీ ఆయన పోటీ చేయడం లేదు. ఆయన కొడుకు పోటీ చేస్తున్నాడు. ఇక ఇంత కంటే విష్ణుకు ఎందుకు ఓటు వేయాలో కారణం లేదు" అని చెప్పుకొచ్చారు.
ప్రకాష్ రాజ్ బయటోడు అయితే.. నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడ పుట్టావు? అంటూ విష్ణుని నాగబాబు ప్రశ్నించారు. మద్రాస్‌లో పుట్టావు.. అక్కడే చదివావు.. మరి కూడా నాన్ లోకల్ కాదా అని నిలదీశారు. విష్ణు మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు.. నీకు తెలుగు కూడా సరిగా రాదు.. ప్రకాష్ రాజ్ కు, నీకు తెలుగు టెస్ట్ పెడితే నీకు పాస్ మార్కులు రావు అని ఎద్దేవా చేశారు. ప్రకాష్ రాజ్ ని తెలుగోడంటారు, విష్ణును తెలుగు నేర్చుకోమంటారు అంటూ సెటైర్స్ వేసారు. కింది నుంచి పైకి వచ్చిన ప్రకాష్ రాజ్‌కు ప్రపంచ జ్ఞానం ఉంది. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాష్ రాజ్. సినిమా జ్ఞానం, ప్రపంచజ్ఞానం ఉన్న ప్రకాష్ రాజ్ కే తన మద్దతు అని నాగబాబు తెలిపారు.
నిర్మాతలతో వివాదం ప్రకాష్ రాజ్ కే కాదు మోహన్ బాబు కుటుంబానికి కూడా ఉన్నాయని నాగబాబు అన్నారు. సలీమ్ సినిమా విషయంలో మీరు డైరెక్టర్ వైవీఎస్ చౌదరి రెమ్యూనరేష్ ఎగ్గొడితే.. ఆయన కోర్టుకు వెళ్లిన సంగతి అందరికీ తెలియదా? అని ప్రశ్నించారు. ఓ స్టార్ డైరెక్టర్ కు అలాంటి గతి పడితే.. మామూలు వాళ్లను మీరు ఇంకెలా చేసి ఉంటారని విరుచుకుపడ్డారు. కాంట్రవర్సీల జోలికి వెళ్లకండి.. మీ ఫ్యామిలీలో ఎన్ని లేవు అంటూ చురకలు వేసారు.
![]() |
![]() |