![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'ఓజీ'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పవన్ రేంజ్ కి తగ్గ అంచనాలున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.
ఇటీవల విడుదలైన 'ఓజీ' గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో పవర్ స్టార్ బాక్సాఫీస్ ఊచకోత కోయడం ఖాయమనే అంచనాలున్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న న్యూస్ మాత్రం పవన్ ఫ్యాన్స్ కి నిరాశ కలిగిస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో పవన్ పాత్ర నిడివి తక్కువ సేపే ఉంటుందట.
మామూలుగా గ్యాంగ్ స్టర్ సినిమాలు ఎక్కువగా హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూనే తిరుగుతుంటాయి. హీరో పాత్ర ఎంత బలంగా ఉంటే, సినిమా అంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. అయితే 'ఓజీ' విషయంలో సుజీత్ ఎంచుకున్న దారి మరోలా ఉందంటున్నారు. హీరో పాత్ర బలంగా ఉన్నప్పటికీ, నిడివి కాస్త తక్కువగానే ఉంటుందట. బలమైన పాయింట్ ని తీసుకొని కథని అల్లుకున్న సుజీత్, అందుకు మరింత బలం చేకూర్చేలా కథలోనే భాగం చేస్తూ హీరో పాత్రని రాసుకున్నాడట. స్క్రిప్ట్ ప్రకారం మొదటి 20-30 నిముషాలు అసలు పవన్ పాత్ర తెరమీద కనిపించదట. పవన్ ఎంట్రీ తర్వాత సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా రాసుకున్నప్పటికీ, ఫస్టాఫ్ లో ఆయన పాత్ర నిడివి మాత్రం 30 నిమిషాల లోపే ఉంటుందట. ఇక సెకండాఫ్ విషయానికొస్తే ఆయన పాత్ర చివరి వరకు ఉన్నట్లు కనిపిస్తుంది కానీ.. నిడివి చూస్తే 30-40 నిమిషాల లోపే ఉంటుందని టాక్. ఇలా మొత్తంమీద పవన్ పాత్ర నిడివి గంటకు అటు ఇటుగా ఉంటుందని వినికిడి.
ఓ వైపు రాజకీయాలు, ఇతర సినిమాలతో బిజీగా ఉన్న పవన్.. సడెన్ గా 'ఓజీ'కి ఓకే చెప్పి, డేట్స్ ఇవ్వడానికి కూడా పాత్ర నిడివి తక్కువగా ఉండటమే కారణం అంటున్నారు. పాత్ర నిడివి తక్కువ కాబట్టి తక్కువ డేట్స్ కేటాయిస్తే సరిపోతుంది. పైగా సబ్జెక్ట్ పవర్ ఫుల్ గా ఉంది. పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ బలమైన ఇంపాక్ట్ చూపించేలా ఉంది. ఈ కారణాలతోనే ఓజీ ని పూర్తి చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. పవన్ ఆలోచన బాగానే ఉంది కానీ.. ఈ సినిమా పైన ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు స్క్రీన్ మీద తమ హీరో పాత్ర నిడివి తక్కువ ఉంటే మాత్రం బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. మరి దీనిపై అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
![]() |
![]() |