![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు మొదలుకొని సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ఎందరో మెగాస్టార్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రత్యేకంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వచ్చి చిరుని కలిసి శుభాకాంక్షలు తెలపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
శివ రాజ్ కుమార్ తన ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఫొటోలు పంచుకున్న చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "డియర్ శివ రాజ్ కుమార్ నన్ను అభినందించేందుకు మీరు బెంగళూరు నుండి రావడం హృదయాన్ని హత్తుకుంది" అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఆయనతో కలిసి కాస్త సమయాన్ని గడపటం, లెజెండరీ నటుడు రాజ్ కుమార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. చిరుని శివన్న కలిసి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

![]() |
![]() |