![]() |
![]() |

గత అక్టోబర్ 19 న దసరా కానుకగా వచ్చి సంచలన విజయం సాధించిన బాలయ్య వన్ మాన్ షో మూవీ భగవంత్ కేసరి. బాలయ్య నటనలో దాగి ఉన్న ఇంకో కొత్త కోణాన్ని కూడా ఆ మూవీ ప్రేక్షకులకి పరిచయం చేసింది. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళని కూడా సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి ఆకర్షణగా మారింది.
భగవంత్ కేసరి హిందీ లాంగ్వేజ్ లో టెలికాస్ట్ కానుంది. రేపు రాత్రి ఎనిమిది గంటలకు హిందీ టెలివిజన్ ప్రీమియర్ గా కలర్స్ సినీ ప్లక్స్ ఛానల్ లో ప్రసారం కానుంది .ఇప్పుడు ఈ వార్తలతో భగవంత్ కేసరికి ఉన్న ప్రాముఖ్యత తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ వార్తలని చూసిన సినీ ప్రముఖులతో పాటు బాలయ్య ఫ్యాన్స్ ఒకటే మాట అంటున్నారు. భగవంత్ కేసరి కథ స్త్రీ శక్తిని బయటకి వెలికి తీసే మూవీ కాబట్టి హిందీ ప్రేక్షకులకి కూడా మూవీ ఖచ్చితంగా నచ్చుతుందనే మాటలు అంటున్నారు.

సుమారు 100 కోట్ల బడ్జట్ తో రూపుదిద్దుకున్న భగవంత్ కేసరి 130 కోట్ల దాకా వసులు చేసి సినిమాని కొనుక్కున్న వాళ్ళకి లాభాలని తెచ్చిపెట్టింది. బాలకృష్ణ సరసన కాజల్ జతగట్టగా శ్రీలీల కూతురు పాత్రలో నటించింది.బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా చేసిన ఈ నేల కొండపల్లి భగవంత్ కేసరిని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది లు నిర్మించారు. అనిల్ రావిపూడి దర్శకత్వాన్ని వహించాడు.
![]() |
![]() |