![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాన్నాళ్ళ తరువాత చేసిన ప్రేమకథా చిత్రం `రాధే శ్యామ్`. పాన్ - ఇండియా మూవీగా రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `జిల్` రాధాకృష్ణ డైరెక్ట్ చేయగా.. బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్.. 150 నిమిషాల (2 గంటల 30 నిమిషాలు) నిడివితో మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతోంది.
ఇదిలా ఉంటే, `రాధే శ్యామ్`లో ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు. తెలుగులో రెబల్ స్టార్ కృష్ణంరాజు పోషించిన పరమహంస పాత్రని ఇతర భాషల్లో సత్యరాజ్ చేశారని సమాచారం. కాగా, ఇప్పటివరకు సత్యరాజ్ తో ప్రభాస్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ముంగిట ఘనవిజయం సాధించాయి. 2013లో వచ్చిన `మిర్చి`, 2015లో రిలీజైన `బాహుబలి - ది బిగినింగ్`, 2017లో విడుదలైన `బాహుబలి - ది కంక్లూజన్`.. ఇలా ప్రభాస్ కి ముచ్చటగా మూడు సార్లు సత్యరాజ్ భలేగా ప్లస్సయ్యాడు. ఈ నేపథ్యంలో.. `రాధే శ్యామ్`తోనూ ఈ కాంబినేషన్ విజయపరంపర కొనసాగుతుందేమో చూడాలి.
![]() |
![]() |