![]() |
![]() |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా అనేక విషయాలు పంచుకున్న ఆయన.. ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నా అని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ఇప్పటివరకు సినిమాలతో పాటు పలు విషయాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నానని, కానీ ఇప్పుడు తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కొరటాల అన్నారు. అయితే, మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. మీడియా చానల్స్, పత్రికల ద్వారా మనం కలుసుకుంటూనే ఉందామని పేర్కొన్నారు. మీడియం మారింది కానీ మన మధ్య బంధంలో ఎలాంటి మార్పు ఉండదని కొరటాల శివ వ్యాఖ్యానించారు. కొరటాల శివ .. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందా అని చర్చ మొదలైంది.

కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' మూవీచిత్రం చేస్తున్నారు. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నారు.
![]() |
![]() |