![]() |
![]() |

`అందాల రాక్షసి`తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు రాహుల్ రవీంద్రన్. ఆపై కొన్ని చిత్రాల్లో హీరోగా అలరించిన రాహుల్.. 2018లో వచ్చిన `చి ల సౌ`తో దర్శకుడిగా టర్న్ అయ్యాడు. సుశాంత్, రుహానీ వర్మ జంటగా నటించిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కట్ చేస్తే.. రెండో సినిమాకే కింగ్ నాగార్జున వంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది రాహుల్ కి. `మన్మథుడు 2` పేరుతో రూపొందిన సదరు చిత్రం.. ఊహాతీత ఫలితాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలో.. రీసెంట్ గా ఓ విమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్ ని రెడీ చేసుకున్నాడట రాహుల్. అంతేకాదు.. ఇందులో ఓ స్టార్ హీరోయిన్ ని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఎ2 పిక్చర్స్ నిర్మిస్తుందని సమాచారం. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీ.. ఈ ఏడాది చివరలో గానీ వచ్చే సంవత్సరం ఆరంభంలో గానీ తెరపైకి వచ్చే అవకాశముందని బజ్.
మరి... `మన్మథుడు 2` నిరాశపరిచిన నేపథ్యంలో.. రాబోయే సినిమాతోనైనా రాహుల్ దర్శకుడిగా సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
![]() |
![]() |