![]() |
![]() |
.jpg)
స్టార్ హీరోయిన్ సమంత అప్పుడప్పుడు వేదాంతం మాట్లాడుతుంటుంది. అంతేకాదు ఏదో సినిమాలు చేస్తున్నాం.. సంపాదిస్తున్నా అనే ధోరణి కాకుండా..కాస్త సామాజిక దృక్పథం, సేవాతత్వం ఉన్న కొద్ది మంది నటిలో సమంత ఒకటి అని చెప్పొచ్చు. అలాంటి సమంత తాజాగా ఫిలసాఫికల్ మాట్లాడి... అందరిని ఆలోచించేలా చేసింది. ఇంతకీ సమంత ఏం మాట్లాడింది అనుకుంటున్నారా..? ఏంటంటే.. మనకు సులువుగా రాదు. వచ్చినా ఎంతో కాలం మనతో ఉండదు. ఉన్నా దానికి మనం విలువ ఇవ్వలేం. .. అని చెప్పింది. కష్టపడి సంపాదించిన రూపాయైనా ఎప్పుడూ అపురూపంగానే ఉంటుంది..కష్టం విలువ నాకు బాగా తెలుసు. ఆలోచిస్తే అందులో కూడా సుఖం ఉంది.. మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. .. అని చెప్పింది. ఎవరైనా స్టార్ అయ్యారంటే, సెలబ్రిటీగా మారారంటే... అదేం తేలిగ్గా వచ్చింది కాదని తెలిపింది. స్టార్ డమ్ అమాంతం వచ్చి పడదు. కష్టపడాలి. చూసేవాళ్లకు మాత్రం అదంతా అదృష్టం అనిపించొచ్చు. కానీ ఆ స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో వాళ్లకే తెలుస్తుంది అని చెప్పుకొచ్చింది.
![]() |
![]() |