![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ఒప్పుకుంటూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా కూడా తెరకెక్కబోతుంది. అయితే ఈసినిమా టైటిల్ ఇంజనీర్ బాబు అని.. ఇందులో సీనియర్ నటి ఖుష్ బూ కీలక పాత్ర పోషిస్తుండగా, బాలీవుడ్ నటుడు సోను సూద్ ని ముఖ్య పాత్రకు తీసుకుంటున్నట్టు ఓ పక్క అప్పుడే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. సరైనోడు సినిమాలో బన్నీకి ప్రతినాయకుడిగా నటించిన ఆది పినిశెట్టిని నెగెటివ్ రోల్ పోషించేందుకు తీసుకున్నట్టు సమాచారం. దాదాపు ఇదే వార్త ఫైనల్ అని ఫిలింనగర్ టాక్. కాగా ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
![]() |
![]() |