![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ 'సలార్ : సీజ్ ఫైర్'. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. సలార్ కి రెండో భాగం కూడా ఉంది. 'శౌర్యాంగ పర్వం' పేరుతో పార్ట్-2 రూపొందనుంది. అయితే 'సలార్-2' ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రభాస్ అభిమానులతో పాటు యాక్షన్ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. అలాగే 'కేజీఎఫ్-3' కూడా చేయాల్సి ఉంది. దీంతో ఈ రెండు ప్రాజెక్ట్ లు పూర్తయిన తర్వాతే ప్రశాంత్ నీల్.. 'సలార్-2' చేసే అవకాశముందని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ మూవీ టీం మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని, త్వరలోనే 'సలార్-2' పట్టాలెక్కుతుందని చెబుతోంది.
ఇప్పటికే 'సలార్-2' స్క్రిప్ట్ పూర్తయిందని, ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలవుతుందని ఇటీవల నటుడు బాబీ సింహా తెలిపాడు. ఇక సలార్ లో వరదరాజ మన్నార్ పాత్రతో ఆకట్టుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం తాజాగా ఇదే చెప్పాడు. 'ది గోట్ లైఫ్' మూవీ ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ.. 'సలార్-2' షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ అవుతుందని అన్నాడు.
అంతేకాదు, 'సలార్-2' షూటింగ్ పృథ్వీరాజ్ పై చిత్రీకరించే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తోనే ప్రారంభమవుతుందట. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందట. వరదరాజ పాత్ర కూడా మొదటి భాగాన్ని మించి.. మరింత బలంగా ఉంటుందని వినికిడి. ఇక ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ పూర్తయ్యాక.. బాబీ సింహా, శ్రియా రెడ్డి, జగపతి బాబులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ప్రస్తుతం 'కల్కి 2898 AD', 'ది రాజా సాబ్' సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. మూడో షెడ్యూల్ నుంచి 'సలార్-2' సెట్స్ లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
'సలార్-2' సినిమాని 2025 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కాగా, 'సలార్' రెండో భాగం 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తరహాలో ఉండనుందని గతంలో నిర్మాత విజయ్ కిరగందూర్ చెప్పడం విశేషం.
![]() |
![]() |