![]() |
![]() |
.webp)
సదా(sada)2002 లో తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన జయం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో సుజాత క్యారక్టర్ లో అత్యద్భుతంగా నటించి నేటికీ ఎంతో మంది యువకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. పైగా మొదటి సినిమాకే ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ ని కూడా అందుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు ముప్పై సినిమాల దాకా చేసింది. కానీ కేవలం ఒకటి, రెండు చిత్రాలు మాత్రమే విజయాన్నిసాధించాయి. తాజాగా ఆమె పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి.
కొన్ని రోజులుగా సదా పెళ్ళికి సంబంధించిన పుకార్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాటి మీద సదా ఏ రోజు స్పందించలేదు. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పెళ్లి విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను. పెళ్లి చేసుకుని ఆ స్వేచ్చని వదులుకోలేను. వాస్తవానికి పెళ్లి పై నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఇప్పటి వరకు నా హృదయానికి ఎవరూ దగ్గర కాలేదు. నచ్చిన వ్యక్తి కనపడితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అదే విధంగా ఇంకొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది.
నేను అరేంజ్‌డ్ మ్యారేజెస్ కి పూర్తిగా వ్యతిరేకం. ఒక వేళ పెళ్లి చేసుకుంటే మాత్రం నూటికి నూరు శాతం లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఆ తర్వాత హస్బెండ్ ని భరించడం కష్టమని అనిపిస్తే విడాకులు కూడా ఇచ్చేస్తాను. ఆ విషయంలో మరో మాట లేదు. ఎందుకంటే భర్తతో ఇబ్బందులు పడుతు కాపురం చేసే అవసరం నాకు లేదు. ఎవరేమి అనుకున్నా విడాకులు తీసుకుంటాను. పైగా అలా తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పింది. సదా ప్రస్తుతం పలు టీవీ షోస్ కి జడ్జి గా చేస్తు ఇంకో పక్క నటనకి ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది.
![]() |
![]() |