![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)అభిమానుల ఆశ ఎట్టకేలకు ఫలించింది. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి గా పవన్ బాధ్యతలు తీసుకోవడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా పవన్ తన అన్నయ్య చిరంజీవి(Chiranjeevi)ఇంటికి వెళ్లి చిరుతో పాటు తల్లికి వదినకి వాళ్ళ పాదాల వద్ద తన శిరస్సు ఉంచి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పటికి ఆ వీడియో సోషల్ మీడీయాలో రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. పవన్ మంచి మనస్సుకి నిదర్శనం ఆ వీడియో అంటూ పొగుడుతున్నారు.ఇక ఫ్యాన్స్ గురించి అయితే చెప్పే పని లేదు. మా పవన్ దేవుడి లాంటి వ్యక్తి అంటూ సోషల్ మీడియాని పోస్ట్ లతో నింపేస్తున్నారు. అదే ఊపుతో పవన్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ (renu desai)కి పోస్ట్ చేసారు. అందుకు ఆమె ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు సుమారు తమ పది సంవత్సరాల అనుబంధాన్ని తెగ తెంపులు చేసుకుంటు డైవర్స్ తీసుకున్నారు. ఆ టైం లో ఒకరి మీద ఒకరు ఎలాంటి కామెంట్స్ చేసుకోలేదు. పైగా రేణు చాలా ఇంటర్వూస్ లో పవన్ చాలా మంచి వ్యక్తి అని చెప్పుకుంటూ వస్తుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ మరి పవన్ నుంచి ఎందుకు విడాకులు తీసుకున్నావంటూ కామెంట్స్ చేస్తు వచ్చారు. కానీ రేణు మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దీంతో కాలక్రమేణా అలా అడిగేవారి సంఖ్య తగ్గుతు వచ్చింది. తాజాగా పవన్ ఎలక్షన్స్ లో సంచలన విజయం సాధించడంతో అభిమానులు మళ్ళీ రేణు కి కామెంట్స్ చెయ్యడం స్టార్ట్ చేసారు. వదిన గారు దేవుడ్ని పెళ్లి చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టుంటే బాగుండేది అంటూ పోస్ట్ లు చేస్తున్నారు. పవన్ ని నేను వదిలెయ్యలేదు. ఆయనే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు అని రిప్లై ఇచ్చింది. ఇప్పుడు ఈ రిప్లై హాట్ టాపిక్ గా మారింది. అదే విధంగా సోషల్ మీడియాలో తనని టార్చర్ చెయ్యడం ఆపాలని కూడా పవన్ అభిమానులని కోరింది.
పవన్ రేణు కలిసి 2000 వ సంవత్సరంలో వచ్చిన బద్రి లో కలిసి నటించారు. ఆ తర్వాత జానీ లో కూడా కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ సినిమాల్లో నటించకుండా పవన్ సినిమాలకే కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి రవితేజ టైగర్ నాగేశ్వర రావు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో పెళ్లి చేసుకుంటానని చాలా సందర్భాల్లో చెప్పింది. ఎంగేజ్ మెంట్ కూడా చేసుకొని క్యాన్సిల్ చేసుకుంది. ఏది ఏమైనా కూడా చాలా సంవత్సరాలకి పవనే వదిలేసాడని చెప్పడం రేణు చెప్పడం చర్చినీయాంశ మయ్యింది. ఎన్నికల్లో గెలిచిన పవన్ కి కంగ్రాట్స్ కూడా చెప్పింది.
![]() |
![]() |