![]() |
![]() |
రియాలిటీ షోలలో ఎక్కువ రీచ్ ఉన్న షోగా బిగ్‌బాస్ ప్రూవ్ చేసుకుంది. ఈ షోకి సంబంధించి ప్రతి సీజన్‌ను ఎంతో ఆసక్తికరంగా మలిచేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తుంటారు. దేశంలోని వివిధ భాషల్లో బిగ్‌బాస్ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు విషయానికి వస్తే... 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్‌ను సెప్టెంబర్ 7 స్టార్ట్ చెయ్యబోతోంది. ఈ సీజన్‌కి కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉంటే.. ఆగస్ట్ 24 ఆదివారం హిందీ బిగ్‌బాస్ సీజన్ 19 ప్రారంభమైంది. ఈ షోకి ఎప్పటిలాగే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో చేస్తున్నందుకు సల్మాన్‌ఖాన్ భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న విషయం తెలిసిందే. సీజన్ 19కి సంబంధించి సల్మాన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ విషయం ఆసక్తికరంగా మారింది.
గత సీజన్స్‌లో హోస్ట్‌గా వ్యవహరించినందుకు 250 కోట్లు పారితోషికం తీసుకున్నారు సల్మాన్. మూడు సీజన్లుగా అతనికి ఇచ్చే ఎమౌంట్‌ను తగ్గించుకుంటూ వస్తున్నారు నిర్వాహకులు. 17వ సీజన్‌కు 200 కోట్లు చెల్లించగా, ఇప్పుడు 19వ సీజన్‌కు దాన్ని 150 కోట్లకు కుదించారు. దానికి కారణం సల్మాన్ చేసే ఎపిసోడ్స్ తగ్గడమే. ఈ సీజన్లో కేవలం 15 వారాలు మాత్రమే సల్మాన్ కనిపిస్తాడు. మిగతా వారాల్లో కరణ్ జోహర్, ఫరాఖాన్ వంటి ప్రముఖులు షోను నిర్వహిస్తారని తెలుస్తోంది. మొదట జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది, తర్వాత కలర్స్ టీవీలో ప్రసారం కానుంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్‌తో సీజన్ 19 ప్రారంభమైంది. ఇంకా ఈ సీజన్లో కొన్ని కొత్త థీమ్‌లను కూడా ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ సీజన్ బిగ్‌బాస్.. అభిమానుల్ని మరింత ఎంటర్టైన్ చెయ్యబోతోంది.
![]() |
![]() |