Home  »  News  »  ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ కింగ్ ఈ హీరోనా!

Updated : Jul 27, 2026

 

ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారతీయ చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్‌డమ్ గురించి చర్చ రాగానే మన అందరికీ మొదట గుర్తుకువచ్చే పేరు ప్రభాస్(Prabhas). బాహుబలి, సలార్, కల్కి వంటి వరుస బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లతో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని కింగ్‌గా నిలిచాడు. అయితే, ఇప్పుడు ప్రభాస్ తర్వాత ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరు కాబోతున్నారు అనే ఆసక్తికరమైన ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది.


ఈ రేసులో అందరికంటే ముందు వరుసలో వినిపిస్తున్న ఏకైక పేరు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor). ప్రస్తుతం రణబీర్ కపూర్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రామాయణం, అనిమల్ పార్క్, లవ్ అండ్ వార్, బ్రహ్మాస్త్ర 2, ధూమ్ 4 వంటి వరుస భారీ ప్రాజెక్టులతో ఆయన ప్రపంచవ్యాప్తంగా తన జెండా పాతేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇన్ని భారీ సినిమాలు లైన్ లో ఉన్నంత మాత్రాన సరిపోతుందా లేదా బాక్స్ ఆఫీస్ వసూళ్లు కూడా అదే స్థాయిలో రాబట్టగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు రణబీర్ కపూర్ కెరీర్‌లో నిజంగానే తిరుగులేని పాన్ ఇండియా మార్కెట్ బిల్డ్ అయిందా లేక కేవలం హైప్ మాత్రమే పెరిగిందా అనే కోణంలో ట్రేడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున విశ్లేషణలు మొదలయ్యాయి.


Also read: ఆ హీరోని పెళ్లి చేసుకోమని అడిగారు.. ఆమని వ్యాఖ్యలు వైరల్ 

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా రణబీర్ కపూర్ కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ ఒక్క సినిమాతో ఆయన సాధించిన ఊరమాస్ ఇమేజ్, బాక్స్ ఆఫీస్ క్రేజ్ మిగతా సినిమాలపై అంచనాలని అమాంతం ఆకాశానికి ఎత్తేసాయి. యానిమల్ చూపించిన తిరుగులేని ఇంపాక్ట్ వల్ల ఇప్పుడు ఆయన రాబోయే సినిమాలపై ప్రేక్షకులలో  క్యూరియోసిటీ నెలకొంది. అయితే ఇక్కడే ఒక పెద్ద రిస్క్ కూడా దాగి ఉందనేది నిపుణుల అభిప్రాయం. లైనప్ ఎంత పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ, బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ రావడం అనేది మరో ఎత్తు. ప్రస్తుతం ఒక్క సినిమా తేడా కొట్టినా లేదా బాక్స్ ఆఫీస్ వద్ద మిస్‌ఫైర్ అయినా, ఆ ప్రభావం మొత్తం రాబోయే బిగ్ లైనప్ మీద పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దర్శకధీరుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణం' చిత్రంపై భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతోంది. గ్లోబల్ రిలీజ్ టార్గెట్‌గా హాలీవుడ్ స్థాయి VFX సాంకేతికతతో  నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 8 న విడుదల కాబోతుంది.

Prabhas, Ranbir Kapoor

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.