![]() |
![]() |

ఇళయ దళపతి విజయ్(Vijay)ప్రస్తుతం 'జన నాయగన్' (జన నాయకుడు) తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. టాక్ అయితే నెగిటివ్ గా వస్తుండంతో పాటు కలెక్షన్స్ కూడా అంత ఆశాజనకంగా లేవు. తమిళనాడుతో పాటు అన్ని చోట్ల ఇదే పరిస్థితి. సోషల్ మీడియాలో కొంత ముందైతే 'జన నాయగన్' పై స్పందిస్తు 'ఎలక్షన్స్ కి ముందు జన నాయగన్ రిలీజై ఉంటే విజయ్ మెజారిటీ సీట్స్ గెలుచుకునే వాడు కాదని అంటున్నారు. వాళ్ళు అలా మాట్లాడటానికి కారణం' జన నాయగన్' సెకండ్ హాఫ్ లో హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్ మధ్య మత కల్లోహాలు అనే ఓల్డ్ పాయింట్ పై అవ్వచ్చు.
తమిళ సినీ పరిశ్రమతో పాటు సౌత్ సినీ పరిశ్రమలో తనదైన వైవిధ్యమైన నటనతో ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ తమిళ నటుడు నిలళ్‌గల్ రవి. రీసెంట్ గా విజయ్ గురించి ఆయన మాట్లాడుతు 'షూటింగ్ సమయంలో విజయ్ చాలా నిశ్శబ్దంగా, తన పని తాను చేసుకునే స్వభావంతో ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి నాయకత్వం వహించే ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతాడని అసలు ఊహించలేదు. 2000వ సంవత్సరంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'ఖుషి', 2003 లో విడుదలైన 'తిరుమలై', 2011 లో వచ్చిన 'కావలన్' వంటి అనేక చిత్రాల్లో చేశాను. ఆ రోజుల్లో షూటింగ్ లొకేషన్లలో ఎన్నో గంటల పాటు మాట్లాడినప్పటికీ, విజయ్ ఆలోచనల్లో ఎప్పుడూ రాజకీయాకాంక్షలు ఉన్నట్లు గానీ, భవిష్యత్తులో రాజకీయం వైపు వెళ్తారనే సంకేతాలు గానీ ఏనాడూ కనిపించలేదని తెలిపారు. కెమెరా ముందుకు రాకముందు ఎంత అమాయకంగా, మౌనంగా ఉంటారో, సెట్స్‌లో కూడా అదే రీతిలో ఉంటూ కేవలం నటనపై మాత్రమే దృష్టి పెట్టేవారని వ్యాఖ్యానించారు.
Also read: సల్మాన్ ఖాన్ కి గిఫ్ట్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్ట్.. జస్టిస్ జ్యోతి సింగ్ కీలక తీర్పు
1990ల మధ్య కాలంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని బలంగా అనుకున్నాను. అలాంటిది కాలక్రమేణా ఎవరూ ఊహించని రీతిలో విజయ్ ఆ రాజకీయ శిఖరానికి చేరుకోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయమని చెప్పుకొచ్చాడు. మూడు దశాబ్దాలపై నుంచే తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచయస్థుడైన నిలళ్‌గల్ రవి జన నాయగన్ లో కూడా నటించాడు.
VIjay, Nizhalgal Ravi, Rajini Kanth
![]() |
![]() |