![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రాధేశ్యామ్' టీజర్ వచ్చేసింది. నేడు(అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ అంచనాలకు మించి ఉంది.
పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న 'రాధేశ్యామ్'లో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజ హెగ్డే నటిస్తున్నారు. నేడు ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విక్రమాదిత్యను పరిచయం చేస్తూ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. లవర్ బాయ్‌గా ప్రభాస్ లుక్, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంగ్లీష్ వాయిస్ ఓవర్, రిచ్ విజువల్స్ తో టీజర్ హై స్టాండర్డ్స్ లో ఉంది. జస్టిన్ ప్రభాకరణ్ అందించిన సంగీతం టీజర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంచనాలను మించి ఉన్న 'రాధేశ్యామ్' టీజర్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
![]() |
![]() |