![]() |
![]() |

కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ది ఘోస్ట్'. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కాజల్ అగర్వాల్ సడెన్ గా తప్పుకోవడంతో.. ఆమె ప్లేస్ లో అమలా పాల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.
'ది ఘోస్ట్' మూవీలో మొదట నాగార్జునకి జోడీగా కాజల్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దాంతో మూవీ టీమ్ ఆమె స్థానంలో అమలాపాల్ ని ఎంపిక చేసినట్టు సమాచారం. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. హీరో హీరోయిన్ మధ్య లిప్ లాక్ సీన్ కూడా ఉంటుందట. అయితే నాగ్ తో లిప్ లాక్ సీన్ కు ఓకే అన్న అమలా పాల్.. అదనపు రెమ్యునరేషన్ ఇవ్వాలని కండిషన్ పెట్టిందట. ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ ఓకే చెప్పారని సమాచారం.
మరోవైపు నాగార్జున ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమా చేస్తున్నాడు. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.
![]() |
![]() |