Home  »  News  »  కామ కూతలను బయటపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ

Updated : Jul 9, 2020

సామాజిక మాధ్యమాలలో నటీమణులకు ఎటువంటి వేధింపులు ఎదురవుతున్నాయనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. అనునిత్యం ఎవరో ఒకరికి ఆకతాయిల నుండి కామ కూతలు తప్పవు. తాజాగా నటి, 'బిగ్ బాస్' ఫేమ్ పునర్నవి భూపాలం ఇటువంటి వేధింపులు ఎదుర్కొన్నారు. 

'నీ ఫొటో చూస్తూ రోజూ హస్త ప్రయోగం చేసుకుంటున్నా' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఒకడు మెసేజ్ చేశాడు. అందులో ఇంగ్లిష్ కూడా సరిగా లేదు. అతడి మెసేజ్ స్క్రీన్ షాట్ తీసిన ఆమె ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ఎవరో ఒకరు వాడికి ఇంగ్లిష్ నేర్పమని అన్నారు. 'ఇవన్నీ కామన్ కదా ఈ రోజుల్లో. అబ్బాయిలకు హస్త ప్రయోగం చేసుకోవడం, గట్రా. సీరియస్ ఎందుకు?' అని ఇంకొకరు మెసేజ్ చేశాడు. ఈసారి పునర్నవి భూపాలం గట్టిగా ఇచ్చింది. 'ఆ గొట్టం గాడిని జస్టిఫై చేయడనికి వీడు వచ్చాడు" అని స్ట్రాంగ్ కోటింగ్ ఇచ్చాడు. 

"ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఉంది. అది తెలుసా?" అని పునర్నవి భూపాలం కామ కూతలు మెసేజ్ చేసిన వాళ్లను ప్రశ్నించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ "అవును. ఇటువంటి వెధవలు ఉంటారు. కొన్ని మెసేజ్ లు నేను డైరెక్టుగా పోస్ట్ చేయడంతో కొంతమంది షాక్ అయ్యారు. నేను పోస్ట్ చేసిన ప్రతిదానికి సెక్స్ కోణంలో మాట్లాడేవారు ఉన్నారు. వాళ్ల భాగోతం బయటపెట్టే సమయం వచ్చింది. వాళ్లు ఎస్కేప్ అవ్వొచ్చని అనుకుంటున్నారు. ఇటువంటి మెసేజ్ లు స్క్రీన్ షాట్ తీసి, సైబర్ క్రైమ్ ద్వారా  కంప్లయింట్ ఇస్తా" అని అన్నారు. ఎవరైనా అటువంటి మెసేజ్ చేస్తే చూసీచూడనట్టు వదలొద్దనీ, డిలీట్ చేయవద్దనీ, వేధింపులకు పాల్పడిన వాళ్లపై  కంప్లయింట్ ఇవ్వమని ఆమె అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.