![]() |
![]() |

ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో? ఏది ట్రెండింగ్ కి వస్తుందో ఎవరూ ఉహించరు. అలాంటిదే ఇప్పుడు ప్రియాంక సింగ్ తన బర్త్ డే రోజున ఓ బోల్ట్ లుక్ ని అభిమానులతో షేర్ చేసుకుంది. అది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అందులో భాగంగానే సాయి తేజ అలియాస్ ప్రియాంక సింగ్ కి కూడా లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ అమ్మాయిలకు అసూయ పుట్టించేలా అందంగా రెడీ అవుతూ అచ్చమైన అమ్మాయిలనే చేసేవాడు సాయి తేజ. అలా అబ్బాయిగా ఉన్న సాయి తేజ కాస్త అమ్మాయిగా మారిపోయి ప్రియాంక సింగ్ గా కొత్త జన్మ ఎత్తింది. ప్రియాంక సింగ్ అంటే ఇప్పుడు పరిచయం అక్కర్లేని సెలబ్రిటీ. బిగ్ బాస్ తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తనని అభిమానులు ముద్దుగా పింకీ అని పిలుస్తారు. బిగ్ బాస్ లో తను అచ్చం తెలుగింటి ఆడపడుచులాగా ఉండేది. తన తీరు అందరికి నచ్చడంతో చాలా మంది ప్రేక్షకులు తనకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. బిగ్ బాస్ నుండి వచ్చాక ప్రియాంక సింగ్ వరుస ఆఫర్స్ తో బిజీ లైఫ్ ని గడుపుతుంది. బిగ్ బాస్ తర్వాత క్రేజ్ పెరిగిందని కాబోలు ఈ అమ్మడు తన రూట్ మార్చింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తుంది.
బిగ్ బాస్ హౌస్ లో సంప్రదాయబద్ధంగా ఉన్న ప్రియాంక సింగ్.. ఇప్పుడు హాట్ అండ్ బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోతుంది. తన బర్త్ డే సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ అభిమానులకి హాట్ ఫోటో షూట్ తో కన్నుల విందు చేసింది. ' ది గ్లింప్స్ ఆఫ్ ది హాటెస్ట్ ట్రాక్ ఆఫ్ ది ఇయర్' అంటూ పోస్ట్ చేసింది. ప్రతీ ఒక్కరికి తమ ఫాంటసీలు ఉంటాయి కానీ మా ఫాంటసీ మీరు చూడటం కోసమే తీసాం అంటూ కొన్ని సెకండ్ల వీడియోని షేర్ చేసింది. ఇందులో బాత్ టబ్ లో నుండి పింకీ బయటకు వచ్చి వైన్ గ్లాస్ తీసుకొని తాగుతూ దర్శనమిచ్చింది. అయితే ఇది సినిమానా లేక మ్యూజిక్ ఆల్బమా లేక వీడియో సాంగా క్లారిటీ ఇవ్వలేదు పింకీ. అయితే ఈ గ్లింప్స్ చూసిన నెటిజన్లు కొంతమంది మండిపడుతూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు సూపర్, హాట్ అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. Priyanka Singh Bathtub Video
![]() |
![]() |