![]() |
![]() |

సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల 'బబుల్ గమ్' సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతుండటం విశేషం.
శ్రీచరణ్ పాకాల ‘బబుల్‌గమ్’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబీ పాట ట్రెమండస్ రెస్పాన్స్ తో వైరల్ అయ్యింది. ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ 'ఇజ్జత్' సాంగ్ అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 23న ఇజ్జత్ సాంగ్ ని చిరంజీవి లాంచ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రోషన్ స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.

క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు నుంచి వస్తున్న మూడో చిత్రమిది. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది.
![]() |
![]() |