![]() |
![]() |

వరుసగా వర్షాలు. ఎప్పుడు ఆగుతాయో తెలియదు. అయినా సరే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. మూవీ లవర్స్ కూడా సినిమా వార్తలని చెక్ చేస్తు బిజీగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక న్యూస్ వాళ్ళని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకర్షించడమే కాదు నిత్యం ఆ ముగ్గురు గురించి సెర్చ్ చేస్తూనే ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఆ ముగ్గరు ఒకేసరి రావడం ఎనలేని సంతోషాన్ని ఇస్తుందని అంటున్నారు. మరి వాళ్ళ సంతోషానికి కారణమైన ఆ ముగ్గురు ఎవరో చూద్దాం.
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(pradeep ranganathan)2022 లో లవ్ టుడే(love to day)ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయాయడు. మిడిల్ క్లాస్ కుర్రోడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆ విధంగా పర్ఫెక్ట్ గా నటించి యూత్ లో మంచి ఇమేజ్ ని పొందాడు. మూవీ కూడా ప్రేక్షాదరణ పొందటంతో పాటు కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో వచ్చాయి. దీంతో ప్రదీప్ అప్ కమింగ్ మూవీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక మొన్న మార్చి లో విడుదలైన ప్రేమలు(premalu)ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు చూరగొన్న మలయాళ ముద్దు గుమ్మ మమిత బైజు(mamitha baiju) క్లిష్టమైన యాక్టింగ్ మూమెంట్స్ ని చాలా అవలీలగా చేసి భారీ ఫ్యాన్స్ బేస్ ని పొందింది. దీంతో ఆమె తదుపరి చిత్రం కోసం కూడా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఫ్రేమ్ ని షేర్ చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇంకో విషయమేంటంటే ఈ మూవీని ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని నిర్మించిన అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)నిర్మించబోతుందని కూడా అంటున్నారు. మైత్రి వారి ట్రాక్ రికార్డు గురించి అందరికి తెలిసిందే. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రానున్నట్లు సమాచారం.మరి ఈ కాంబో ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్లినా పాన్ ఇండియా లెవల్లో రికార్డు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ప్రేమలు ని తెలుగులో మైత్రి నే విడుదల చేసింది.
![]() |
![]() |