![]() |
![]() |

'డీజే టిల్లు' సినిమాతో యువతకు ఎంతగానో చేరువైన సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న 'టిల్లు స్క్వేర్'లో నటిస్తున్నాడు. అలాగే నీరజ కోన దర్శకత్వంలో 'తెలుసు కదా' అనే సినిమాని ప్రారంభించాడు. దీనితో పాటు నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించనుందని సమాచారం.
నందిని రెడ్డి సినిమాలో సిద్ధు సరసన సమంత నటించే అవకాశముందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు పూజ హెగ్డే పేరు తెరపైకి వచ్చింది. టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో సందడి చేసిన పూజా హెగ్డే.. వరుస పరాజయాలతో కొంతకాలంగా వెనుకబడిపోయింది. ఏవో కారణాల వల్ల 'గుంటూరు కారం', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి బడా సినిమాలు చేజారిపోయాయి. బాలీవుడ్ కి వెళ్లినా అక్కడా అంతగా కలిసి రాలేదు. మొన్నటిదాకా బుట్టబొమ్మగా ఒక వెలుగు వెలిగిన పూజ కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయింది. ఇలాంటి సమయంలో ఆమె కుర్ర హీరో సిద్ధు సరసన నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. మరి ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చి పూజ మునుపటిలా దూసుకుపోతుందేమో చూడాలి.
![]() |
![]() |